Begin typing your search above and press return to search.
ఖాన్ ల ఇంటి పక్కనే 119కోట్లతో ఇల్లు కొన్న మొనగాడు!
By: Tupaki Desk | 11 July 2022 12:30 PM GMTరణవీర్ సింగ్ - దీపికా పదుకొనే ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ - సల్మాన్ ఖాన్ కి పొరుగువారిగా మారారు. ముంబై నగరంలో అల్ట్రా రిచ్ బాంద్రాలో 119 కోట్లతో క్వాడ్రప్లెక్స్ (నాలుగంతస్తుల)ను కొనుగోలు చేసి తమ హోదా ఖాన్ లకు ఏమాత్రం తక్కువ కాదు! అని నిరూపించారు.
ఇండస్ట్రీ ఆదర్శ జంటగా ఉన్న రణవీర్-దీపిక... ముంబై బాంద్రాలోని లష్ రెసిడెన్షియల్ టవర్ సాగర్ రేషమ్ లో సీ-వ్యూ అపార్ట్మెంట్ (క్వాడ్రప్లెక్స్)ను కొనుగోలు చేశారు.
తాజా వార్తల ప్రకారం.. 119 కోట్ల కు ఈ ఇంటి కోసం చెల్లించారు. బాలీవుడ్ స్టార్లలో లేదా దేశంలోని ప్రముఖ స్టార్లలో ఒకే అపార్ట్ మెంట్ కోసం అత్యంత ఖరీదైన ఒప్పందం చేసుకున్న జంటగా రణవీర్- దీపిక పేరు నిలిచింది.
అలాగే ఈ టవర్ సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్స్ .. షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లా మధ్య ఉంది. క్వాడ్రప్లెక్స్ భవనంలో రణవీరుని అపార్ట్ మెంట్ 16 - 17- 18 - 19 అంతస్తులలో ఉంది. ఇది మొత్తం 11266 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతం... 1300 చదరపు అడుగుల ప్రత్యేకమైన టెర్రేస్ ను కలిగి ఉంది.
చుట్టుపక్కల ప్రాపర్టీల విలువను పరిశీలిస్తే.. చ.అ.కు రూ.లక్ష వరకూ ఉంది. రణవీర్ సింగ్ అతని తండ్రి జుగ్జీత్ సుందర్ సింగ్ భవ్నానీ డైరెక్టర్లుగా ఉన్న ఓహ్ ఫైవ్ ఓహ్ మీడియా వర్క్స్ LLP ద్వారా ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఇక రెవెన్యూ శాఖకు చెల్లించిన స్టాంపు డ్యూటీ విలువ రూ.7.13 కోట్లు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రణవీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి 'సిర్కస్'.. కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రాలలో నటిస్తున్నాడు. దీపిక పదుకొనే తదుపరి ప్రభాస్ ప్రాజెక్ట్ కే తో పాటు షారూక్ సరసన నటిస్తోంది.