Begin typing your search above and press return to search.
కోట్లు సంపాదించినా కారు కొనకుండా ఆటోల్లో తిరిగే హీరో
By: Tupaki Desk | 29 Aug 2021 9:00 AM GMTఎప్పుడూ లేని రీతిలో ఈ మధ్యన మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక వార్త వైరల్ గా మారింది. దాని సారాంశం.. సీనియర్ నటుడు.. ఉద్యమ చిత్రాల హీరోగా సుపరిచితుడైన ఆర్ నారాయణమూర్తి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఉన్నట్లుగా పోస్టులు వెలిశాయి. దీంతో..అయ్యో పాపం అంటూ చాలామంది జాలిపడితే.. మరికొందరు మేం లేమా? అన్నట్లు స్పందించి.. ఆయనకు సాయం చేయటానికి సిద్ధమయ్యారు. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో.. ఆయన తనకు తానుగా మీడియా ముందుకు వచ్చి.. తనకు ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని.. తాను అప్పుల పాలు కాలేదని.. తన దగ్గర సరిపడా ఆస్తులు.. డబ్బులు ఉన్నాయని వివరణ ఇచ్చారు.
ఒకదశలో తనకు డబ్బుల కొదవ లేదని.. కోట్లు ఉన్నట్లుగా చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన ఆస్తులేంటి? అన్న దాని మీద ఎవరికి ఎలాంటి క్లారిటీ ఉండదు. కాకుంటే.. ఆయన.. ఆయన మిత్రులు కలిసి స్నేహ చిత్ర అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ మీద సామాజికంగా చైతన్యపరిచే మూవీల్ని తీస్తుంటారు. తాజాగా ఆయన ఆస్తుల గురించి.. ఆయన రవాణా సౌకర్యం గురించి... తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు.
ఉద్యమ చిత్రాలతో తాను కోట్ల రూపాయిలు సంపాదించానని.. ఆ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల్లోని విద్య.. వైద్యం.. రోడ్డు వేయించటం లాంటి ప్రోగ్రాంలకు ఖర్చు చేశా. అయితే.. ఆస్తులు కూడబెట్టలేదు. కనీసం కారు కూడా కొనుక్కోలేదు. మరి.. రవాణా సౌకర్యం ఎలా అన్న సందేహం అక్కర్లేదని.. ఎంచక్కా ఆటోల్లో ప్రయాణిస్తుంటానని చెప్పారు. సినిమానే జీవితంగా బతికానని.. తన తల్లిదండ్రులకు కూడా డబ్బు మీద యావ లేదన్నారు.
తన తండ్రి95 ఏళ్లు బతికారని.. తన విజయాలు.. అపజయాలు అన్ని చూశారని.. తన తల్లికి 90ఏళ్లు అని.. తన సక్సెస్ చూసి ఆమె సంతోషిస్తూ ఉంటుందని.. గర్వంగా ఫీల్ అవుతుందంటూ ఆయన తనకు సంబంధించిన సంగతులు చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేస్తున్నావు.. మంచి పని చేస్తున్నావని తన తల్లి తనను ఆశీర్వదిస్తారని చెబుతారు. ఇంత ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పటం చాలామంది హీరోలకు సాధ్యం కాదేమో?