Begin typing your search above and press return to search.
ఆ షో అంటే సెలబ్రిటీలు మోహం చాటేస్తున్నారా..?
By: Tupaki Desk | 17 April 2020 3:15 AM GMTకొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకుల పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. గత మూడు సీసన్లుగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ ఏడాది జూలైలో నాలుగో సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు, హోస్ట్‌ల కోసం నిర్వాహకులు ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌లుగా పాల్గొనేందుకు ఎవ్వరూ ఆసక్తిి చూపడం లేదని సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ఎందుకంటే బిగ్‌బాస్ షోపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక హిందీ బిగ్‌బాస్‌లో చూసినట్లయితే.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు షో ముగిసిన తరువాత పెద్ద పెద్ద ఆఫర్లు దక్కించుకుంటున్నారట. కానీ తెలుగు బిగ్ బాస్ లో పరిస్థితి వ్యతిరేకంగా ఉందంటున్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొని హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవ్వరికీ పెద్దగా ఆఫర్లు రావడం లేదట. కంటెస్టెంట్లు మాత్రమే కాదు బిగ్‌బాస్ విన్నర్‌లకు కూడా షో తరువాత అడపాదడపా అవకాశాలు మాత్రమే పొందుతున్నారట. ఇందుకు ఉదాహరణగా మూడు సీజన్లలో విజేతలైన శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌లను చూపిస్తున్నారట.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో పాల్గొనకపోవడమే మంచిదని చాలామంది అనుకుంటున్నారని వినికిడి. ఈ భిన్నమైన అభిప్రాయాలతో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినా మోహం తిప్పేస్తున్నారట. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా.. ఈ షోలో పాల్గొనేందుకు వారు ఆసక్తి చూపించకపోవడం షాక్ కి గురిచేస్తున్న విషయం. ఈ క్రమంలో కొంతమంది సింగర్లు, సెకండరీ గ్రేడ్ నటులను తీసుకురావాలని బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించనున్నట్లు టాక్. మరి ఈ సారి బిగ్‌బాస్‌లో ఎవరు పాల్గొనబోతున్నారు..? హోస్ట్ ఎవరు..? లాంటి ప్రశ్నలకు ఇంకా జవాబులు తెలియాల్సి ఉంది.