Begin typing your search above and press return to search.
అమ్మడి కన్ను రాజకీయాల మీద పడింది!
By: Tupaki Desk | 19 Oct 2018 4:41 AM GMTకొంతమంది ఎన్ని సినిమాలు చేసినా..వారికి పెద్దగా క్రేజ్ ఉండదు. వార్తల్లో నలగరు. కానీ.. మరికొందరు ఇందుకు పూర్తి భిన్నం. చేసింది తక్కువ సినిమాలే అయినా అభిమాన గణాన్ని సంపాదించుకోవటం.. గుర్తింపు తెచ్చుకోవటమే కాదు.. తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు అమలాపాల్.
తన లుక్స్ తో కట్టి పడేసే అమలాపాల్ చేసింది కొద్ది సినిమాలే అయినా.. అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ చెరగని ముద్రేసింది. ఆమె వాడి చూపులకు ఫ్లాట్ అయ్యేలా చేసింది. సినిమాల్లో మంచిపేరు తెచ్చుకునే వేళలోనే ప్రేమ.. పెళ్లి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె వైవాహిక బంధం సాఫీగా సాగలేదు. మనస్పర్థలతో కలిసి ఉండే కన్నా.. విడిపోవటం మేలన్న భావనతో వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చేశారు.
విడాకులతో కాస్త డిస్ట్రబ్ అయినా.. అంతలోనే తేరుకొని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనకు ఎదురైన సమస్యలకు డీలా పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళుతున్నారు. ఇప్పటివరకూ సౌత్ లోనే అందరికి తెలిసిన అమలాపాల్.. ఇప్పుడు నార్త్ మీద కూడా ఒక కన్నేశారు. సినిమాల పరంగా ఆమె కెరీర్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటి వేళలో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. తన తర్వాతి అడుగు ఎటువైపు అన్న క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని వెల్లడించింది. అయితే.. తనకు రాజకీయాలు బొత్తిగా తెలీవని.. ఫ్యాన్స్ రమ్మంటే తప్పకుండా వస్తానని చెప్పింది.
ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రావటం ఖాయమని.. టైం వస్తే ఏమైనా జరగొచ్చన్న అమలాపాల్.. తన ఫ్యాన్స్ కోరితే రాజకీయాల గురించి ఆలోచిస్తానని.. చూద్దాం.. ఏమైనా జరగొచ్చంది. సరిగ్గా ఇలాంటి మాటల్నే అప్పట్లో చిరంజీవి నోటి నుంచి రావటం గమనార్హం.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మధ్యన ఆమెకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని ఆమె ధైర్యంతో ఎదుర్కొనటమే కాదు.. తనకు ఎదురైన సమస్యే ఎదురైతే ఏం చేయాలో చేతల్లో చేసి చూపించింది అమలాపాల్. కొంతకాలంగా ఒక వ్యక్తి అమలాపాల్‌ను అదే పనిగా విసిగిస్తున్నాడట. నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడట. అతని బాధ పడలేని అమలాపాల్ తాజాగా ఆ వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో ఆమెను కలిసిన మీడియా ప్రతినిధులు.. మీకు ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు.. ఇలాంటి ఘటనల్ని ఎదుర్కోవాలన్న విషయాన్ని మహిళల్లో చైతన్యం కలిగించేందుకు వీలుగా రాజకీయాల్లోకి వస్తారా? అన్న మాట వచ్చిందట. అప్పటి నుంచి అమలాపాల్ మనసులో పాలిటిక్స్ అనే పుస్తకం ఒకటి తెగ తిరుగుతోందట. రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమని.. అయితే ఎప్పుడన్నది చెప్పలేనని చెబుతోంది. ఏమైనా.. మీరెప్పుడు వచ్చినా.. కొత్త కెరీర్ కు వెల్కం.