Begin typing your search above and press return to search.

అమ‌లాపాల్ కు పితృవియోగం

By:  Tupaki Desk   |   22 Jan 2020 8:46 AM GMT
అమ‌లాపాల్ కు పితృవియోగం
X
హీరోయిన్ అమ‌లాపాల్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అమ‌లాపాల్ తండ్రి పాల్ వ‌ర్గీస్(61) క‌న్ను మూసారు. పాల్ వ‌ర్గీస్ కొన్ని రోజులుగా అనారోగ్యం కార‌ణంగా కొచ్చి ఆసుప‌త్రిలో చికిత్స‌ పొందుతున్నారు. ఆరోగ్యం విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే అమ‌లాపాల్ హుటాహుటీన కొచ్చి బ‌య‌లుదేరి వెళ్లింది. అమలాపాల్ స్వ‌స్థ‌లం కొచ్చిలోని పాల్ వ‌ర్గీస్ అంత్యక్రియలు బుధ‌వారం సాయంత్రం కురుప్పంపాడు చ‌ర్చి వాటిక‌లో జ‌రుగుతాయ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

పాల్ వ‌ర్గీస్ మృతిప‌ట్ల అమ‌లాపాల్ స‌మ‌కాలీకులు.. స్నేహితులు.. స‌న్నిహితులు దిగ్భాంతిని వ్య‌క్తం చేసారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. అమ‌లాపాల్ సినిమాల్లోకి రావ‌డం తండ్రికి మొద‌టి నుంచి ఇష్టం లేదు. చివ‌రికి తండ్రిని ఒప్పించి ముందుగా మోడ‌లింగ్ రంగంలో నిరూపించుకుంది. అటుపై సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డంతో న‌టిగా స్థిర‌ప‌డింది.

అనంత‌రం త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం కొన్నాళ్ల‌కే ఆ బంధం వీగిపోవ‌డం తెలిసిందే. ఈ విష‌యం అమ‌ల‌పాల్ తండ్రి పాల్ వ‌ర్గీస్ ను మాన‌సికంగా ఎంతో కుంగ‌దీసింద‌ని అప్ప‌ట్లో మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక తండ్రితో అమ‌లాపాల్ కి ఎంతో స‌న్నిహిత అటాచ్ మెంట్ ఉండ‌డం తాజా ప‌రిస్థితిలో తీవ్రంగానే కుంగ‌దీసింద‌ని తెలుస్తోంది.