Begin typing your search above and press return to search.
సినిమా కోసం మార్చురీ వెళ్లి పోస్ట్ మార్టం చూశానన్న నటి
By: Tupaki Desk | 18 Aug 2022 6:37 AM GMTగ్లామర్ ప్రపంచంలో అందచందాలు మాత్రమే కాదు టాలెంట్ ను గుర్తించేలా వ్యవహరించే నటీమణులు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు అమలాపాల్. ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యే కొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. స్క్రిప్టు డిమాండ్ చేయాలే కానీ అందాల ఆరబోతకు అడ్డు చెప్పేదే లేదనే మాట మిగిలిన వారిలో ఎలా ఉన్నా.. అమలాపాల్ మాత్రం కాస్తంత డిఫరెంట్ అనాలి. స్క్రిప్టు అడగాలే కానీ.. ఆమె ఎంతటి సాహసానికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు.
ఈ సినిమాలో పాత్ర కోసం మార్చురీకి వెళ్లి.. పోస్టుమార్టంను కళ్లారా చూడటం సాధ్యమవుతుందా? అందుకు అసలు ఒప్పుకుంటారా? అన్న సందేహం వస్తుంది. కానీ.. అమలాపాల్ లాంటి నటి ఉన్నప్పుడు అవన్నీ పెద్ద విషయాలే కావు.
తాజాగా ఆమె నటించిన 'కడవర్' మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉన్న ఈ మూవీ ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సౌత్ లో ఉన్న బ్యూటీల్లో అమలాపాల్ కాస్త భిన్నం. ఈ సినిమా కోసం తాను చేసిన పనుల గురించి చెప్పినప్పుడు.. ఇలాంటివి ఆమెకు మాత్రమే సాధ్యమన్న భావన కలగటం ఖాయం.
తాను నటించిన భద్ర పాత్ర తనకు చాలా కొత్త అనుభవంగా చెప్పారు. ఈ మూవీ కోసం చాలా ఎక్కువ గ్రౌండ్ వర్కు చేయాల్సి వచ్చిందని.. దర్శకుడు.. రచయితతోకలిసి చాలామందిని కలిశామని.. పలు హాస్పిటల్స్ కు వెళ్లినట్లు చెప్పారు.
ఈ మూవీలో భాగంగా మార్చురీకి కూడా వెళ్లినట్లు చెప్పారు. అక్కడ నేరుగా పోస్ట్ మార్టం చేయటాన్ని తాను చూశానని.. అది జీవితాన్ని మార్చే అనుభవంగా ఆమె అభివర్ణించారు. నేరుగా పోస్టు మార్టం చేయటం చూశాక.. అక్కడి దృశ్యాలు మనసును కదిలించివేశాయన్నారు.
ప్రాణం లేని శరీరాన్ని చూసినప్పుడు నిజంగా ప్రాణం లేదా? మేలుకొని లేదా? అన్నట్లుగా అనిపించందన్నారు. ఏమైనా సినిమా మీద ఫ్యాషన్ వేరు.. దాని కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం వేరు. ఆ విషయంలో మిగిలిన నటీమణులకు అమలాపాల్ పూర్తి భిన్నం.