Begin typing your search above and press return to search.
కేరళ వరదల్లో చిక్కుకున్న హీరోయిన్
By: Tupaki Desk | 20 Aug 2018 9:05 AM GMTకేరళ రాష్ట్రం పది రోజులుగా వరదల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.. అక్కడి ప్రజలు తిండి, నీరు లేక అష్టకష్టాలు పడుతున్నారు.సాయం కోసం ఇళ్ల పైకెక్కి దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఈరోజు కూడా వరుణుడు వదలకుండా వాన కురిపిస్తూనే ఉన్నాడు. మళ్లీ ఏం ముంచుకొస్తుందోనని అక్కడి భయంభయంగా ఉంటున్నారు.
ఇప్పుడు కేరళలో ధనవంతుడు, పేదవాడు ఇద్దరూ ఒకటే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ఆహార పదార్థాలన్నీ పాడైపోయి తిండికోసం అలమటిస్తున్నారు. అంతా వరద బాధితులుగా మారి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు జయరామ్ ఇల్లు కూడా నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. ఇక కొచ్చిలోని హీరోయిన్ అనన్య ఇల్లు కూడా నీట మునిగిపోయింది. వాట్సాప్ లో తన కాలనీ పరిస్థితిని వీడియోలో తీసి షేర్ చేసి తన ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయిందని ఆమె వాపోయింది. కుటుంబ సభ్యులంతా వరద రావడంతో భయపడ్డారని.. శుక్రవారం సురక్షితంగా వరద నుంచి బయటపడ్డామని పేర్కొంది.
ఇల్లు వరదలో మునిగిపోవడంతో పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంటున్నామని అనన్య చెప్పుకొచ్చింది. వరదల్లో తమ లాగే చాలామంది బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటున్నారని.. వారందరినీ కాపాడాలని కోరింది. ఇక మరో నటుడు సలీమ్ కుమార్ తన కుటుంబంతో పాటు చుట్టుపక్కల 50మందిని తన ఇంటిపైభాగంలో చేర్చాడు. వారంతా ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా సెలెబ్రెటీలు, పేదలు అన్న తేడా లేకుండా కేరళ వరదలు అందరినీ నిరాశ్రయులను చేశాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి