Begin typing your search above and press return to search.
పచ్చ బికినీలో రగిలిస్తున్న కుర్రబ్యూటీ
By: Tupaki Desk | 7 Sep 2022 5:02 PM GMTహిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది అనన్య పాండే. నేటితరం అందాల నాయికల్లో క్షణం తీరిక లేకుండా కెరీర్ బండిని నడిపిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే లైగర్ లో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన అనన్య పెయిర్ ఆకట్టుకున్నా కానీ మూవీలో కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది.
సౌత్ లో ఆరంగేట్ర చిత్రం లైగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనన్య ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యిందని అర్థమవుతోంది. లైగర్ విడుదల తర్వాత ఈ అమ్మడు అస్సలు ఇటువైపు చూసినట్టే కనిపించడం లేదు. తదుపరి తన బాలీవుడ్ కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేయడం తప్ప ఇప్పట్లో సౌత్ గురించి ఆలోచించే యోచనే చేయదని కూడా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో అనన్య దుమారం రేపుతోంది. తాజాగా పచ్చ బికినీలో అనన్య కొత్త ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఇందులో అనన్య రెబలియన్ లుక్ ఆకట్టుకుంది. బికినీలో ఒంపు సొంపులను ప్రదర్శించింది.
అనన్య పెళ్లెప్పుడంటే...?!
ఇటీవల `ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్` రెండవ సీజన్ లో అనన్య పాండే పెళ్లి గురించి ప్రస్థావన వచ్చింది. తన స్నేహితురాళ్లు షానాయ కపూర్ - సుహానా ఖాన్ ల కంటే అనన్య ముందే పెళ్లాడుతుందా? అంటూ ఒక ప్రశ్న ఎదురైంది. ఎపిసోడ్ లలో ఒకదానిలో తన తల్లి గారైన భావన పాండే - చుంకీ పాండే వివాహ వ్యవహారంపైనా ముచ్చటించింది.
ఇక స్నేహితుల్లో మొదట ఎవరు పెళ్లి చేసుకుంటారనే దాని గురించి షానయ కపూర్ మాట్లాడుతూ.. నువ్వే (అనన్య) మొదట వివాహం చేసుకుంటావని నేను భావిస్తున్నాను అనగానే.. దానికి లైగర్ బ్యూటీ అనన్య వెంటనే అంగీకరించింది. నా ఆలోచన మొత్తం నేను వారితో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాను. అది జరిగే వరకు వేచి ఉండాలి! అంటూ నవ్వేసింది.
మొదట అనన్య తరువాత సుహానా (ఖాన్) ఆపై నేను! అంటూ సానయా చాలా నస పెట్టింది. అంతేకాదు.. ఈ వేదికపై అనన్య మరో ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. ``నాకు మూడు రోజుల పెళ్లి కావాలి.. ఫంక్షన్ లాగా జరగాలని కోరుకుంటున్నాను`` అని చెప్పింది. షనాయ కూడా సంప్రదాయ వివాహాన్ని కోరుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శశాంక్ ఖైతాన్ `బేధడక్`తో షానయ సినీ అరంగేట్రం చేస్తుంది. అనన్య తదుపరి చిత్రం `ఖో గయే హమ్ కహాన్`తో బిజీ అవుతోంది. మరోవైపు సుహానా కూడా తెరంగేట్రం చేస్తోంది. గల్లీ బోయ్ ఫేం జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న `ది ఆర్చీస్`తో ఆరంగేట్రం చేస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.