Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : లైగర్ భామ అందాల మధురిమ..!

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 AM GMT
ఫోటో స్టోరీ : లైగర్ భామ అందాల మధురిమ..!
X
లైగర్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా చేసిన హడావిడికి వచ్చిన రిజల్ట్ కి అందులో నటించిన హీరోనే కాదు హీరోయిన్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యింది. సాధారణంగా పూరీ సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆ హీరోయిన్ రేంజ్ మారిపోతుంది. కానీ అనన్యా పాండేకి ఆ లక్ కలిసి రాలేదు. లైగర్ తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు. బాలీవుడ్ లోనే ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది అనన్యా పాండే.

సినిమాలు చేస్తున్నా చేయకపోయినా ఆడియన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలని అనుకుంటారు వారి దారిలోనే అనన్యా కూడా తన అందాలతో మత్తు మందు చల్లేస్తుంది. అమ్మడి ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేస్తే చాలు గ్లామర్ ఫోజులతో అనన్యా హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ లో జరిగిన ITA2022 అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న అమ్మడు తన అవుట్ ఫిట్ తో ఎట్రాక్ట్ చేసింది. పైన రెడ్ కలర్ కింద లైట్ పింక్ కలర్ కాస్ట్యూం తో మెరుపులు మెరిపిస్తున్న అనన్యా పాండే తన మార్క్ గ్లామర్ షోకి ఎప్పుడూ సిద్ధమే అని హింట్ ఇస్తుంది. బాలీవుడ్ భామలు స్కిన్ షో విషయంలో పెద్దగా పట్టింపులు చూపించరు.

సినిమాల్లోనే కాదు దీపికాతో కలిసి నటించిన గెహ్రాయాన్ లో కూడా దీపికాకు ఈక్వల్ గా అందాలతో అలరించింది అనన్యా పాండే. సినిమాలు, వెబ్ సీరీస్ ఛాన్స్ ఎలాంటిదైనా సరే తన సత్తా చాటాలని ఎప్పుడూ రెడీ అంటుంది అమ్మడు. బాలీవుడ్ లో స్టార్ గా ఎదగడానికి చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్న అనన్యాకి కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది. సౌత్ లో చేసిన మొదటి సినిమానే నిరాశపరచగా మళ్లీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.

ITA2022 అవార్డ్ వేడుకల్లో అనన్యా పాండే నటించిన గెహ్రాయాన్ వెబ్ సీరీస్ కు గాను అవార్డ్ అందుకుంది అనన్యా పాండే. ఈ అవార్డ్ తనకెంతో స్పెషల్ అంటూ తనకు ఈ అవార్డ్ రావడానికి కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపింది అనన్యా పాండే. ఇదే దూకుడుతో అమ్మడు తన సినిమాలతో కూడా దూసుకెళ్తే మరిన్ని అవార్డులు ఆమె చెంత చేరే అవకాశం ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.