Begin typing your search above and press return to search.

అనసూయ బోల్డ్ లుక్.. మైండ్ బ్లోయింగ్

By:  Tupaki Desk   |   28 Jan 2023 8:00 AM GMT
అనసూయ బోల్డ్ లుక్.. మైండ్ బ్లోయింగ్
X
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది జబర్ధస్త్ షో. ఆ కార్యక్రమం నుంచి పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత సుకుమార్ తీసిన రంగస్థలంలో రంగమ్మత్తగా మెరిసింది. ఆ పాత్రతో తన యాక్టింగ్‌ తో మెస్మరైజ్ చేసిన అనసూయ.. ఆ తర్వాత పుష్పలోనూ దాక్షాయణిగా గుర్తుండే పోయే పాత్ర చేసింది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ జబర్దస్త్ గా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుండే అనసూయ... సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతలోనూ ముందుంటుంది.

ఎప్పుడూ నెటిజన్స్‌ ను తన వైపు తిప్పుకునేందుకు అందాల ఆరబోతలు చేస్తూ ఉండే అనసూయ.. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో వదిలింది. ఇంకేం ఉంది.. ఆ చిత్రాలు కుర్రకారు గుండెల్ని పిండేస్తున్నాయనే చెప్పాలి. ఎన్నడూ చూడని లుక్స్ లో అనసూయ చూపులు ఉండటంతో.. నెటిజన్స్ ఆమెపై హార్ట్‌ ల వర్షాన్ని కురిపిస్తున్నారు. కొందరైతే అను అవి కళ్లా.. అను బంబులా, సూపర్ గా ఉన్నావ్ అంటూ.. నిన్నూ చూస్తు బతికేయొచ్చు, క్లాసిక్ లుక్, హలీవుడ్ హీరోయిన్ అంటూ పలువుర నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

ఇక ఆ మధ్య అనసూయను కొంతమంది అంటీ అంటూ చేసిన వివాదం తెలిసిందే. తనని ఆంటీ అనొద్దు అని ఎన్నో సార్లు చెప్పింది. అయినప్పటికీ చాలా మంది ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేసే వారికి కూడా అనసూయ ఎన్నోసార్లు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది.

ఎన్టీఆర్ నాగ చిత్రంలో ఓ చిన్న పాత్రతో పరిచయమైన ఈ భామ... ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత రంగస్థలం, పుష్ప2 చిత్రాలు బాగా గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. ఇక ప్రస్తుతం అనసూయ చేతిలో పుష్ప 2, రంగమార్తాండ, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్, సింబా సినిమాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.