Begin typing your search above and press return to search.
పెళ్లయిన వాడితో ఎఫైర్ వల్ల డిప్రెషన్!
By: Tupaki Desk | 10 Aug 2019 4:54 PM GMTగాయని.. అందాల కథానాయిక ఆండ్రియా గురించి పరిచయం అవసరం లేదు. గాయనిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని పాడిన ఆండ్రియా `యుగానికి ఒక్కడు` చిత్రంలో కథానాయికగా నటించింది. అటుపైనా పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. నాగచైతన్య `దడ` చిత్రంలో దివాళి దీపాన్ని పాటతో ఆండ్రియాలోని హస్క్ యూత్ కి ఓ రేంజులో కనెక్టయ్యింది. ప్రస్తుతం కా.. వట్టం.. మాలింగై చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు ఆండ్రియా త్వరలోనే తనలోని కొత్త కోణాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. ఈ పుస్తకం పేరు `బ్రోకెన్ వింగ్`. ఇందులో తన ప్రేమ గురించి .. ఆ ప్రేమలో చేదు అనుభవాల గురించి వర్ణించబోతోందట. అది కూడా పోయెట్రీని ధారాలంగా ప్రెజెంట్ చేయబోతోంది. ప్రేమలో తన వైఫల్యానికి కారణాల్ని పోయెట్రీ రూపంలో వెల్లడిస్తోందట.
నేను ఇప్పటికే ఓ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. తనతో సహజీవనం చేశాను. అతడు నన్ను మానసికంగా శారీరకంగానూ వేధించాడు. గాయపరిచాడు. అందువల్లనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి కెరీర్ ని వదిలేశాను! అంటూ ఆండ్రియా ఈ పుస్తకంలో వెల్లడించారట. అలాగే ఇన్ స్టాగ్రమ్ ద్వారాను ఈ పుస్తకంలోని పోయెట్రీని రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నానని వెల్లడించింది. ఈ పుస్తకం సంగతేమో కానీ.. అసలు పెళ్లయిన వాడిని ప్రేమించడం ఎందుకు? అటుపై బ్రేకప్ అవ్వడం .. డిప్రెషన్ లోకి వెళ్లడం ఎందుకు? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు తన గతంపై.