Begin typing your search above and press return to search.

డ్యాన్సులేస్తే వస్తాయ్.. యాక్టింగ్ చేస్తే రావ్

By:  Tupaki Desk   |   14 March 2018 12:42 PM GMT
డ్యాన్సులేస్తే వస్తాయ్.. యాక్టింగ్ చేస్తే రావ్
X
కొన్నిసార్లు అది నిజమే అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా దాని గురించి మాట్లాడేంత ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ ఉంది అంటే ఎక్కడైనా సరే నోట్లోంచి వచ్చే ప్రతీ మాటా ఆచి తూచి వేసే అడుగులాగా ఆలోచించి రావాలి. కానీ ఆండ్రియా మాత్రం దానికి విరుద్ధం అని ఉమెన్స్ డే సందర్భంగా తేల్చి చెప్పింది.

మన ఉంటున్న సమాజంలోని కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కూడా పురుషాధిక్యత ఎక్కువని చెప్పాలి. ఇది అందరికీ తెలిసిన నిజమీ అయినా దానిపై స్పందించేంత ధైర్యం కొంతమందే చేయగలరు. అందులో ఆండ్రియా ఒకరు. ఈమధ్యనే ఈమె తారామణి అనే సినిమాలో నటించింది. సినిమా బాగానే ఆడింది. ఆండ్రియా పెరఫార్మన్సుకు కూడా నూటికి నూరు మార్కులు పడ్డాయి. కానీ అవకాశాలే పెద్దగా ఏమి రాలేదు. దీనిపై కోపంగా ఉన్న ఆండ్రియా ఉమెన్స్ డే రోజున మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేసింది. 'అదే విజయ్ సినిమాలో మూడు పాటల్లో డాన్సులు వేస్తే నాలుగైదు ఆఫర్లు వచ్చి పడతాయి. కానీ నా యాక్టింగ్ నచ్చినా ఒక్క అవకాశం కూడా రాదు ఎందుకు?" అంటూ నిలదీసేసారికి అందరూ సైలెంట్ అయిపోయారు.

తను కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే అంకితం అవ్వాలని అనుకోవట్లేదు అని తను సెక్సీ రోల్స్ ఎంత బాగా చేస్తుందో అంతే బాగా నటించగలదు అని కూడా అందరూ నమ్మేలా చేయలనేదే ఆమె ఆశ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నడుం ఊపడం, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం తనకేం ఇష్టంలేదు అంటూ విరుచుకుపడింది.