Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు బ్రేక్ కు కారణంచెప్పిన హాటి
By: Tupaki Desk | 9 Aug 2019 8:05 AM GMTహీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు దక్కించుకుని మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న ఆండ్రియా గత ఏడాది కాలంగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో ఈమె సినిమాలకు బ్రేక్ తీసుకుంది. తన వద్దకు వచ్చిన పదుల కొద్ది ఆఫర్లను ఈ అమ్మడు తిరష్కరించినట్లుగా సమాచారం అందుతోంది. గత ఏడాది వడకర్రీ చిత్రం తర్వాత ఈమె మరే సినిమాను చేసింది లేదు. అంతకు ముందు వరుసగా సంవత్సరంలో మూడు నాలుగు సినిమాల చొప్పున చేసిన ఆండ్రియా సినిమాలకు దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
సోషల్ మీడియాలో కూడా ఆండ్రియా గతంలో మాదిరిగా యాక్టివ్ గా లేదు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు.. కొన్ని సాహసంతో కూడుకున్న పాత్రలను కూడా చేసిన ఆండ్రియా ఉన్నట్లుండి సినిమాలకు దూరం అవ్వడంను అంతా జీర్ణించుకోలేక పోయారు. అసలు ఆండ్రియాకు ఏమైంది.. ఆమె ఎందుకు నటించడం లేదు అనే విషయమై క్లారిటీ వచ్చింది. తాజాగా స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
వరుసగా చిత్రాలు చేసిన తాను శారీరకంగా మరియు మానసికంగా బాగా అలసి పోయాను. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రతి రోజు పనితో ఒకానొక సమయంలో లేవలేని పరిస్థితికి వెళ్లి పోయాను. అదే సమయంలో ఒత్తిడి నుండి బయట పడేందుకు విపరీతంగా కాఫీ తాగేదాన్ని. కాఫీ అలవాటును మానేసేందుకు ఆయుర్వేదం ట్రీట్ మెంట్ ను ఆశ్రయించాను. ఆ ట్రీట్ మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక్కోసారి ఆ ట్రీట్ మెంట్ ను వదిలేసి పారిపోవాలనిపించేది. కషాయం మాదిరిగా ఉండే తేనీరును ఉదయం లేవగానే తాగేసి యోగా చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
శారీరక మరియు మానసిక సమస్యల నుండి సాంత్వన పొందేందుకు ఆయుర్వేద చికిత్సను ఆశ్రయించినట్లుగా చెప్పుకొచ్చింది. వీక్ హార్ట్ కలిగిన వారు ఆ చికిత్సను భరించడం చాలా కష్టం. నేను దాన్ని భరించాను. ప్రస్తుతం తాను పూర్తి రికవరీ అయ్యాను అంది. త్వరలోనే ఆండ్రియా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఆండ్రియా చెప్పిన కారణం జన్యూన్ గా లేదనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.