Begin typing your search above and press return to search.

డ‌మ్మీ అయిపోయాన‌ని తెగ ఫీలైపోతున్న సింగ‌ర్ కం న‌టి

By:  Tupaki Desk   |   25 Feb 2021 8:00 AM IST
డ‌మ్మీ అయిపోయాన‌ని తెగ ఫీలైపోతున్న సింగ‌ర్ కం న‌టి
X
కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే యువ సంగీత ద‌ర్శ‌కుడితో ఎఫైర్ గాడి త‌ప్పేలా చేసింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత డిప్రెష‌న్ లోకి వెళ్లిన స‌ద‌రు గాయ‌ని కం న‌టి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోందని భావిస్తే ఈలోగానే మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది.

ఈసారి ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలో ఆఫ‌ర్ అంటూ ఎర వేసిన ద‌ర్శ‌కుడు త‌న‌ని డ‌మ్మీగా చూపించ‌డంతో తెగ ఇదైపోతోంది. ఇంత‌కీ ఏ సినిమాలో? అంటే.. మొన్న సంక్రాంతి బ‌రిలో రిలీజైన `మాస్ట‌ర్` లో క‌నిపించిన‌ హాట్ ఆండ్రియా గురించే ఇదంతా. మీది ఎంతో ఇంపార్టెంట్ రోల్.. పైగా పెద్ద హీరో క‌దా మ్యాడ‌మ్!! అంటూ త‌న‌ని ద‌ర్శ‌కుడు ఒప్పించాడ‌ట‌. తీరా చూస్తే దానికి తెర‌పై అస్స‌లు ప్రాధాన్య‌తే లేదు. దీంతో తీవ్రంగా హ‌ర్ట‌యిపోయిన ఆండ్రియా సీరియ‌స్ గా ఓ నిర్ణ‌యం తీసేసుకుంది. ఇక‌పై త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త లేనిదే అస్స‌లు అంగీక‌రించ‌న‌ని చెబుతోంది. పెద్ద హీరోల‌తో అస‌లు అలాంటి అవ‌కాశాలే రాక‌పోతే క‌నీసం నాయికా ప్ర‌ధాన చిత్రాల్లో అయినా న‌టిస్తాన‌ని అంటోంది.

అయినా ఆండ్రియాకు తెలియ‌నిదా త‌న రేంజు ఎంతో! త‌న‌కు ఏ స్థాయి అవ‌కాశం ఇవ్వాలో ద‌ర్శ‌కుల‌కు మాత్రం తెలియ‌దా? పైగా ట్యాలెంటెడ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కి తెలీనిదా? ప్రస్తుతం ఆండ్రియా వ‌రుస సినిమాలు చేస్తోంది. వాటిల్లో ట్యాలెంట్ చూపిస్తే స‌రిపోతుందేమో! మిస్కిన్‌ దర్శకత్వంలో పిశాచు-2... దిల్‌ సత్య దర్శకత్వం లో మాళిగైతో పాటు కో అనే వేర‌క చిత్రంలోనూ ఆండ్రియా న‌టిస్తోంది. వీటిలో ఏది హిట్టు కొట్టినా కెరీర్ మ‌రికొంత కాలం దేకుతుంది. లేదంటే ఇక ఖాళీ అయిన‌ట్టే.