Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

By:  Tupaki Desk   |   4 Dec 2016 5:00 PM GMT
ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
X
సుమారు 15 సంవత్సరాల కిందట.. నువ్వు నేను సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన హీరోయిన్ అనిత గుర్తుందా..? ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చినా ఆ తరువాత మాత్రం సరైన హిట్లు లేక తెరమరుగైపోయింది. తాజాగా ఆర్పీ పట్నాయిక్ సినిమా మనలో ఒకడులో మళ్లీ మెరిసింది. దీంతో అనిత మరోసారి అందరికీ గుర్తొచ్చింది.

చిన్నచిన్న సినిమాల్లో నటించినా ఏదీ పెద్దగా కలిసిరాని అనిత హిందీ సీరియళ్లలో మాత్రం ఫుల్లు బిజీగా ఉంది. అంతేకాదు... అక్కడ ఆమెకు మంచి స్టార్ డమ్ కూడా వచ్చింది. యే హై మొహబ్బత్ వంటి సీరియళ్లు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. దీంతో ఆమె ఆదాయానికి ఏమాత్రం ఢోకా లేకుండా ఉందట. అంతేకాదు... తెలుగు ఇండస్ర్టీలో ఒక మోస్తరు హీరోయిన్ల రెమ్యూనరేషన్ స్థాయిలో ఆమె సంపాదన ఉంటోందట.

హిందీ సీరియళ్లలో బిజీగా ఉన్న అనిత షూటింగ్ లు లేని సమయమంతా హైదరాబాద్ లోనే ఉంటోంది. కారణం తెలుసు కదా.. ఆమె హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/