Begin typing your search above and press return to search.

చిన్న డ్రెస్‌లో అంజలి.. లెగ్స్ అందాలు అదరహో

By:  Tupaki Desk   |   27 Feb 2023 6:00 AM GMT
చిన్న డ్రెస్‌లో అంజలి..  లెగ్స్ అందాలు అదరహో
X
అమ్మాయిలకు షాపింగ్‌ కు ఎనలేని అనుబంధం ఉంటుందని చెప్పక తప్పదు. అమ్మాయిలతో షాపింగ్ కి వెళ్తే రోజుల తరబడి అక్కడే గడిపేయాల్సి వస్తుందని జోకులు కూడా మన నిరంతరం చూస్తూనే ఉంటాం. అయితే ఇదే నిజం అంటుంది హీరోయిన్ అంజలి. తెలుగు అమ్మాయి అయినా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా ఫేమస్ అయినా అంజలి... తెలుగులో కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. గీతాంజలి వంటి సినిమాలతో హిట్లు కొట్టింది.

కానీ ఆమెకు ఎక్కువగా క్రేజ్ మాత్రం తమిళనాడులోనే లభించింది. ఈ మధ్య వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఆమె... తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె షాపింగ్ చేసి అప్పుడే షాపింగ్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలను షేర్ చేసి.. ఇది రిటైల్ తెరపి అని ప్రస్తుతానికి వీకెండ్ మోడ్ ఎంజాయ్ చేస్తున్నానంటూ అంజలీ కామెంట్లు చేసింది.

ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలను బట్టి పరిశీలిస్తే ఆమె ఎక్కడో విదేశాల్లో విహరిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంజలి ఒకప్పుడు పద్దతైన పాత్రల్లోనే కనిపించేది కానీ ఈ మధ్య గ్లామర్ షోకి సైతం సై అంటోంది.

అందుకే సోషల్ మీడియాలో అడపా దడపా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. ఇక తాజాగా ఫోటోలలో కూడా పొట్టి డ్రెస్ లో కనిపిస్తూ లెగ్స్ అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది.

ప్రస్తుతానికి అంజలి చేతిలో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రాంచరణ్ 15. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా... ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో అంజలి నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా రావడంతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమాతో అంజలికి బ్రేక్ దొరుకుతుందని భావిస్తున్నారు.

చివరిగా ఆమె మాచర్ల నియోజకవర్గం సినిమాలో రాను రాను అంటున్న.. అనే ఒక ఐటెం సాంగ్ లో నర్తించింది. ఆ తర్వాత తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇక ఆమె చేసిన ఝాన్సీ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్క్రిమింగ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ భామ ఆర్సీ 15 తో హిట్ కొట్టి మరిన్ని అవకాశాలు చేజిక్కించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.