Begin typing your search above and press return to search.

# ఆర్సీ 15 త‌ర్వాత అంజ‌లి పెళ్లి!?

By:  Tupaki Desk   |   14 March 2023 7:00 AM GMT
# ఆర్సీ 15 త‌ర్వాత అంజ‌లి పెళ్లి!?
X
త‌మిళ్ లో స‌క్సెస్ అయినంత‌గా అంజ‌లి తెలుగులో సక్సెస్ కాలేదు. కొంద‌రు స్టార్ హీరోల చిత్రాల్లో సెకెండ్ లీడ్ కే ప‌రిమిత‌మైంది త‌ప్ప‌! స్టార్ హీరోయిన్ గా మాత్రం ఫేమ‌స్ కాలేక‌పోయింది. కోలీవుడ్ లో సాగినంత లాంగ్ జ‌ర్నీ టాలీవుడ్ లో లేద‌నే చెప్పాలి. అయితే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్సీ 15 లో ఛాన్స్ అందుకుని మ‌రోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్రంలో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది.

సినిమా స‌క్సెస్ అయితే పాన్ ఇండియాలోనే గుర్తింపు ద‌క్కుతుంది. ఇక సినిమాపై ఉన్న అంచ‌నాల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌లోనూ ఆస్కార్ ని ముద్దాడిన టీమ్ లో రామ్ చ‌ర‌ణ్ కూడా భాగ‌మ‌వ్వ‌డంతో! అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఈర‌క‌మైన ప్ర‌చారం అంజలికి కెరీర్ కొంత వ‌ర‌కూ క‌లిసొచ్చేదే. ఆస్కార్ న‌టుడి సినిమాలో భాగ‌మైందంటూ అప్పుడే కొత్త ప్ర‌చారం మొద‌ల‌వుతుంది.

ఆర‌కంగా మ‌రోసారి మీడియా అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. మ‌రి ఈ సినిమా త‌ర్వాత అంజ‌లి పెళ్లి చేసుకుం టుందా? అంటే అవున‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం. అంజ‌లి ఇంట్లో త‌ల్లిదండ్రులు మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించుకున్నారుట‌. అంజ‌లికి కుటుంబంతో ఒక‌ప్పుడు విబేధాలుండనేవారు. అయితే ఇప్పుడ‌వ‌న్ని స‌మ‌సి పోవ‌డంతో అంజ‌లి కుటుంబానికి బాగా ద‌గ్గ‌రైంది. ఈ నేప‌థ్యంలో రాజోలు బ్యూటీ వాళ్ల నిర్ణ‌యాన్ని గౌర‌వించి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని వినిపిస్తుంది.

అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆర్సీ 15 రిలీజ్ త‌ర్వాత అంజ‌లి ఓ ఇంటిదయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. అలాగే అంజ‌లిపై గ‌తంలో కొన్ని రూమ‌ర్లు వైర‌ల్ అయ్యాయి. ఓ కోలీవుడ్ హీరోతో డేటింగ్ చేసింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. పెళ్లి కూడా చేసుకుం టుంద‌ని వినిపించింది. అయితే కొన్ని రోజుల‌కి ఆ ప్రచారం క‌నుమ‌రుగైంది. ఆ త‌ర్వాత అంజ‌లి పేరు ఎలాంటి రిలేష‌న్ షిప్ లోనూ వినిపించ‌లేదు. అంజ‌లి తల్లిదండ్రులు ఉద్యోగాల‌ రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.