Begin typing your search above and press return to search.

ఒకే ఒక్కటి.. ల‌క్కుని మార్చేస్తోందిగా!

By:  Tupaki Desk   |   12 Nov 2022 2:30 AM GMT
ఒకే ఒక్కటి.. ల‌క్కుని మార్చేస్తోందిగా!
X
మ‌ల‌యాళ మూవీ `యాక్ష‌న్ హీరో బీజు`తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఇండో అమెరిక‌న్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన రొమాంటిక్ కామెడీ డ్రామా `మ‌జ్ను`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విరించి వ‌ర్మ రూపొందించిన ఈ మూవీతో తెలుగులో తొలి హిట్ ని సొంతం చేసుకున్న అను ఇమ్మాన్యుయేల్ ఆ త‌రువాత రాజ్ త‌రుణ్ తో `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, విశాల్ తో `తుప్ప‌రివాల‌న్‌` వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్ ల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

ఇక ఆక్సిజ‌న్ నుంచి శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ క‌లిసి న‌టించిన `మ‌హా స‌ముద్రం` వ‌ర‌కు బ్యాక్ లు బ్యాక్ ఫ్లాపులు, డిజాస్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ ఐర‌న్ లెగ్ అనిపించుకుంది. అక్క‌డి నుంచి అను కు క్రేజీ ఆఫ‌ర్లు లేవు.. భారీ సినిమాలు లేవు. వ‌రుస‌గా ఫ్ల‌పుల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన అను ఇమ్మాన్యుయేల్ దీంతో ఎలాగైనా ఈ సారి బిగ్ బ్యాంగ్ తో రావాల‌పి బోల్డ్ కంటెంట్ తో చేసిన డిఫ‌రెంట్ అటెమ్ట్ `ఊర్వ‌శివో రాక్ష‌సివో`.

అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ నిర్మాత‌లు ధీర‌జ్ మోగిలినేని, విజ‌య్ నిర్మించారు. రాకేష్ శ‌శి రూపొందించిన ఈ మూవీ రీసెంట్ గా విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ మూవీకి అను ఇమ్మాన్యుయేల్ అందాలు, శిరీష్ తో త‌న‌కు కుదిరిని కెమిస్ట్రీ ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. 2017 నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అను ఇమ్మాన్యుయేల్ కు ఈ మూవీ మంచి బ్రేక్ నిచ్చేలా వుంది.

గ‌తంలో అను ఇమ్మాన్యుయేల్ గురించి ప‌ట్టించుకోని వారంతా ఇప్పుడు త‌న వెంట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే త‌మిళంలో హీరో కార్తి తో క‌లిసి `జ‌పాన్‌` మూవీలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది అను ఇమ్మాన్యుయేల్ . ఈ మూవీతో పాటు తెలుగులోనూ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్ అని అను ఇమ్మాన్యుయేల్ ద‌క్కించుకున్న‌ట్టుగా చెబుతున్నారు. `ఊర్వ‌శివో రాక్ష‌సివో` హిట్ త‌రువాత అను ఇమ్మాన్యుయేల్ ల‌క్కు ఒక్క‌సారిగా మారడంతో అంతా త‌న వెంట ప‌డుతున్నార‌ట‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.