Begin typing your search above and press return to search.

మూగ జీవాలతో అనుపమ.. సో క్యూట్

By:  Tupaki Desk   |   24 Nov 2022 3:30 AM GMT
మూగ జీవాలతో అనుపమ.. సో క్యూట్
X
మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ ఒక విధంగా సొంత భాషలో కంటే తెలుగులోనే మంచి హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది. ఈ బ్యూటీ అదృష్టం ఏమిటో గాని చిన్న సినిమాలతోనే భారీ విజయాలను ఎక్కువ స్థాయిలో అందుకుంది. అయితే అలాంటి విజయాలు అందుకున్నప్పటికీ కూడా అగ్ర హీరోలతో మాత్రం పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పెద్దగా పట్టించుకోకుండా తన స్టైల్ లో ముందుకు సాగుతోంది.

అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది. కానీ మరి ఎక్కువగా హద్దులు మాత్రం దాటడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని డిఫరెంట్ ఫోటోలు కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా అమ్మడు కొన్ని పిల్లులతో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. అందులో చాలా క్యూట్గా హావభావాలు చూపించిన అనుపమ ఎంతో ప్రేమను చూపిస్తోంది.

గతంలో చాలాసార్లు ఆమె నేచర్ లవర్ అని చెప్పకనే చెప్పింది. ఇక ఇప్పుడు ఈ విధంగా మూగజీవాలతో క్యూట్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. అందులో ఆమె చిరునవ్వు కూడా చాలా హైలైట్ గా నిలిచింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె పాత్ర ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ హీరోయిన్ గా అయితే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం 18 పేజీస్ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలుస్తుంది. ఆ సినిమాలో కూడా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించాడు. మరి రెండవ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. అలాగే అనుపమ మలయాళం ఇండస్ట్రీలో కూడా మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. వీలైనంతవరకు తన పాత్ర సరికొత్తగా ఉండే విధంగా ఆమె కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఆ మధ్య రౌడి బాయ్స్ లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా లిప్ లాక్ సన్నివేశంతో కూడా అనుపమ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాత్ర కంటెంట్ నచ్చితే అలాంటి పాత్రలు నటించడంలో తప్పు లేదని కూడా ఆమె తెలియజేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.