Begin typing your search above and press return to search.
పవన్-భూమికల గురించి అపూర్వ !
By: Tupaki Desk | 1 Jun 2018 12:00 PM GMTఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో ఈ మధ్య బాగా వినిపించిన పేరు శ్రీరెడ్డి తర్వాత అపూర్వ పేరే. పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూపై మాట్లాడటం - ఇండస్ట్రీ ఒక బాడీని నియమించడం తదితర చర్యల వల్ల వాతావరణం కొంచెం సైలెంటయ్యింది. తాజాగా అపూర్వ కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ కొన్ని కొత్త విషయాలు చెప్పింది. ఇండస్ట్రీలో 60 శాతం మంచి వాళ్లే ఉన్నారని - కానీ 40 శాతం మంది వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తోందన్నారు.
రాజమౌళి వంటి పని మీద మాత్రమే ఫోకస్ పెట్టే దర్శకులతో పనిచేయడం మంచిదన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఆయన దృష్టి పనిమీదే ఉంటుంది. ఈయన లాంటి వారు ఇండస్ట్రీలో ఇంకా చాలా మందే ఉన్నారన్నారు.
అమ్మాయిలు ఎక్కడున్నా ఆత్మవిశ్వాసం - గౌరవం కోల్పోకూడదు. అలాంటి వారికి ఉదాహరణ భూమిక. భూమిక చాలా మంచి అమ్మాయి - స్ట్రిక్ట్ గా ఉంటుందని అపూర్వ అన్నారు. తన పనేదో తాను చూసుకునేది. ఆమెతో అనవసర విషయాలు మాట్లాడాలంటే హీరోలు కూడా జంకే పరిస్థితి ఉండేది. ఇక పవన్ గురించి కూడా ఆమె మాట్లాడింది. పవన్ కు ఉన్నంత సహనం ఎవరికీ లేదని - ప్రజా జీవితంలో ఉన్నవారికి అది చాలా అవసరం ఉపయోగం అని చెప్పిందావిడ. తల్లిని శ్రీరెడ్డి ఆవేశంలో అనరాని మాటన్నారు. అది శ్రీరెడ్డి చేసిన చాలా పెద్ద తప్పు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. అదే ఆయన క్యారెక్టర్ అని చెప్పింది. పవన్ ఫ్యాన్స్ కూడా వారి అభిమాన హీరోలాగా ఉంటే పవన్ కీర్తి ఇంకా పెరుగుతుందన్నారు.