Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్..ఆ హీరో అంటూ సంచలన నిజాల్ని బయటపెట్టిన బాపూ బొమ్మ
By: Tupaki Desk | 4 Nov 2021 4:09 AM GMTచూసినంతనే బాపు బొమ్మ అన్నంత అందంగా.. తెలుగుదనం కొట్టొచ్చినట్లు ఉండే ఆ అందానికి పేరు పెడితే సినీ నటి ఆర్చన అవుతుంది. అందం.. అందుకు తగ్గ అభినయం ఉన్నప్పటికీ తెలుగు సినిమాల్లోచిన్న పాత్రలకే పరిమితం కావటం.. సరైన బ్రేక్ రాలేదన్న బాధ కలుగుతుంది. అయితే.. ఆమె ముక్కుసూటితనం.. ఆఫర్ల పేరుతో ఏది పడితే అది చేయటానికి సిద్ధంగా లేకపోవటం.. అవకాశం వచ్చింది కదా అని.. రోల్ ను ఎలా పడితే అలా మార్చేస్తే ససేమిరా అనే ఆర్చనకు పెద్దగా ఆఫర్లు రాలేదు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో పాల్గొన్న ఆమె.. తన ఆటతో అందరిని ఆకట్టుకుంది. అలాంటి ఆర్చన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చాలా ప్రాజెక్టులు చేజారి పోవటం గురించి చెప్పే వేళ.. ఆమె కొన్ని ఆసక్తికర అంశాల్ని షేర్ చేశారు.
ఒక డైరెక్టర్ ఉండేవాడని.. చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండేది కాదన్నారు. చెప్పిన కథకు తీసే దానికి సంబంధం ఉండకపోవటం.. అదేమని అడిగితే.. కవర్ చేసేవాడని చెప్పారు. అంతేకాదు.. సెట్లో ఎందుకు ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పి.. కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసేవారని చెప్పారు. అతడి మాటల్ని నమ్మి.. నిజంగానే తప్పుగా ఆలోచించానా? అనిపించి సెట్ కు వెళితే.. అతడి తీరు మళ్లీ భిన్నంగా ఉండేదని చెప్పారు.
చాలా స్వీట్ గా మాట్లాడుతూ.. బ్రెయిన్ వాష్ చేసే అతగాడి మాటలకు.. చేతలకు సంబంధం లేకపోవటమే కాదు.. పని దగ్గర చిరాకు పెట్టేవాడని.. అందుకే అతగాడి ప్రాజెక్టు నుంచి తాను తప్పుకున్నానని.. తర్వాత అది కూడా ఆగిపోయిందన్నారు. అంతేకాదు..సినిమా రంగానికి చెందిన మరో హీరో గురించి కూడా ఆమె షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. ఒక హీరో ఉండేవాడని.. అతనికి సక్సెస్ లు లేవని.. అలాంటి ఆ హీరో తన మైండ్ ను ప్రభావితం చేసే ప్రయత్నం చేశాడని చెప్పారు. చెప్పే మాటలకు.. నిజానికి సంబంధం ఉండేది కాదని.. ఆ హీరో ఆలోచన చాలా వంకరగా ఉండేదని పేర్కొన్నారు.
తన సంగతి ఫర్లేదు కానీ.. ఫ్యామిలీ సపోర్టు లేకుండా వచ్చే అమ్మాయిలు..ఇలాంటి వారి మాటలకు ట్రాప్ లో పడే ప్రమాదం ఉందన్నారు. తన ఫిలాసఫీ ఒక్కటేనని.. మనకుమనగా గుడ్.. బ్యాడ్ అని తెలిసిపోతుందని.. దానికి తగ్గట్లే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి తన తండ్రికి చెబితే సీరియస్ అయ్యారని.. ఏం మాట్లాడుతున్నారంటూ ఎదురు ప్రశ్నించటంతో వారు మళ్లీ మాట్లాడకుండా ఉండిపోయారని చెప్పింది.