Begin typing your search above and press return to search.
అఖిల్ 4 .. భామలు ఇంకా సస్పెన్స్
By: Tupaki Desk | 2 July 2019 4:58 AM GMTఅక్కినేని అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని తేవడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. అయితే నటుడిగా డ్యాన్సర్ గా అఖిల్ ఏనాడూ నిరాశపరచలేదన్న ప్రశంసలు దక్కాయి. అక్కినేని చియాన్ హార్డ్ వర్క్ కి గుర్తింపు దక్కింది. అయితే అతడి హార్డ్ వర్క్ నాలుగో సినిమాతో ఫలించబోతోందని ఇండస్ట్రీలో జోస్యం చెబుతుండడం ఆసక్తిని పెంచుతోంది. కింగ్ నాగార్జున సైతం తాను నటించిన నాలుగో సినిమాతోనే హిట్టు కొట్టారు. అప్పటివరకూ కెరీర్ పరంగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అక్కినేని అభిమానులు విశ్లేషిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
1986లో `విక్రమ్` అనే సినిమాతో నాగార్జున వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా యావరేజ్ ఫలితమే. ఆ తర్వాత కెప్టెన్ నాగార్జున- అరణ్య కాండ ఫ్లాపులయ్యాయి. ఆ క్రమంలోనే అక్కినేని బ్రాండ్ ప్రేమకథా చిత్రం `మజ్ను` అతడి కెరీర్ కి బంపర్ హిట్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ కి కీలక మలుపునిచ్చిన చిత్రమిది. అటుపైనా కొన్ని ఫ్లాపులు వచ్చినా అప్పటికే అనుభవం ఘడించి మ్యానేజ్ చేయగలిగారు.
అందుకే ఇప్పుడు అఖిల్ కెరీర్ కి నాలుగో సినిమా కీలక మలుపునిస్తుందన్న విశ్లేషణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే సరైన స్క్రిప్టు కోసం అఖిల్ చాలానే వేచి చూశాడు. తనకు సరిపడే కథ - దర్శకుడి ఎంపిక కోసం ఓపిగ్గానే కసరత్తు చేశాడు. అతడికి బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుండడంతో సక్సెపైనా ధీమా పెరిగింది. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే భాస్కర్ అదిరిపోయే ప్రేమకథ- ఎమోషన్ ఉన్న స్క్రిప్టును రెడీ చేశారట. ఇప్పటికే సినిమా ప్రీప్రొడక్షన్ పూర్తయింది. గత నెల 26న తొలి షెడ్యూల్ ప్రారంభం అవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ అఖిల్ సరసన హీరోయిన్ ఖరారు కాలేదు. రష్మిక మందన- కియారా అద్వాణీ పేర్లు వినిపించినా ఫైనల్ కాలేదట. ప్రస్తుతం నాయికను ఫైనల్ చేసే పనిలో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ -భాస్కర్ జోడీని దారిలోకి తెచ్చే బాధ్యతను గీతా ఆర్ట్స్ తీసుకుంది. మరి ఆ బాధ్యత ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.