Begin typing your search above and press return to search.
తాగిన మత్తులో రోడ్డుపై డాన్స్ చేసిన నటి అరెస్ట్, పోలీసులతోనూ గొడవ
By: Tupaki Desk | 18 Oct 2020 12:30 AM GMTతమిళనాడు చెన్నై అర్కాట్ రోడ్డులో అర్థరాత్రి సమయంలో ఒక కారు అడ్డ దిడ్డంగా ముందుకు సాగుతుంది. ఆ కారు ఎక్కడ గుద్దేస్తుందో అనే భయంతో చాలా మంది వాహనాలు పక్కకు ఆపుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ కారులో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఊగుతూ తూగుతూ డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఆమె తీరు కొందరికి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే అక్కడ గుమ్మి కూడిన కొందరు ఆమె నటి అని.. పలు సినిమాల్లో నటించిందని గుర్తించారు. అప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమె ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో నైట్ పార్టీ కి హాజరు అయ్యి వస్తుంది. పోలీసులు అక్కడ నుండి ఆమెను పంపించేందుకు ప్రయత్నించగా పోలీసులతోనూ గొడవకు దిగింది.
పోలీసులు ఆమె వాహనంతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. ఆమె మత్తు దిగిన తర్వాత ఆమెను విచారించారు. పోలీసులు ఆమెకు రూ.10 వేల రూపాయల జరిమాన విధించారు. ఆ సమయంలో తాను విస్కీ.. బ్రాందీ ఏమీ తాగలేదని కేవలం బీర్ లు మాత్రమే తాగాను అని అది కూడా తక్కువే తాగాను. ఈ ప్రపంచంలో తాగి డ్రైవ్ చేసింది నేను ఒక్కదాన్నేనా.. నాపైనే ఎందుకు ఇంత కోపం అంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. తాగి డ్రైవింగ్ చేయడంతో పాటు రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు గాను కేసు నమోదు చేయడంతో పాటు ఆమె కారును స్వాదీనం చేసుకున్నారు. ఆమెకు ఒక రాజకీయ నాయకుడు జామీను ఇచ్చి బెయిల్ పై విడిపించుకు వెళ్లాడు. ఈ నటి విషయం ప్రస్తుతం చెన్నై లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.