Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఎంఎంఎస్ వీడియో కోసం వేట..
By: Tupaki Desk | 17 July 2017 8:34 AM GMTమలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసు ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు. హీరోయిన్ కిడ్నాప్ కు కిడ్నాప్ కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సీనియర్ హీరో దిలీప్ ను పోలీసులు అరెస్టు చేయడం.. కొన్ని రోజుల నుంచి విచారిస్తుండటం.. కోర్టు అతడికి బెయిల్ కూడా నిరాకరించడం తెలిసిందే. ఐతే దిలీప్ అరెస్టయినంత మాత్రాన ఈ కేసు తేలిపోయినట్లుగా పోలీసులు భావించట్లేదు. అతను కుట్రకు బాధ్యుడని తేల్చే.. కీలక ఆధారాల కోసం వేట కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ కేసులో హీరోయిన్ ను కిడ్నాప్ చేసి ఆమెపై కార్లో లైంగిక దాడికి పాల్పడినప్పుడు తీసిన ఎంఎంఎస్ వీడియో క్లిప్ కీలక సాక్ష్యం అవుతుందని భావిస్తున్నారు.
హీరోయిన్ని కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పల్సర్ సుని.. ఆమెను వీడియో తీసినట్లు అంగీకరించినట్లు.. ఆ క్లిప్ ఓ మెమొరీ కార్డులో పెట్టి దిలీప్ కు ఇచ్చినట్లు అంగీకరించాడని సమాచారం. ఐతే ఆ వీడియో ఎక్కడన్నదే తెలియట్లేదు. దిలీప్ భార్య కావ్య మాధవన్ కు చెందిన ఓ స్టోర్లో ఈ మెమొరీ కార్డు కోసం గత నెలలో పోలీసులు విచారణ జరిపారు. కానీ అక్కడ కూడా అది దొరకలేదని తెలుస్తోంది. దిలీప్ లాయర్ దగ్గర ఈ మొమొరీ కార్డు ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే అతణ్ని కూడా అరెస్టు చేయొచ్చని అంటున్నారు. దిలీప్ ఫోన్లోని డేటాను పరిశీలించగా.. అతడి కాల్ వివరాలు.. ఇతర సమాచారం ఉంది కానీ.. ఎంఎంఎస్ క్లిప్ మాత్రం దొరకలేదని సమాచారం. మరి ఈ క్లిప్ ఉన్న మెమొరీ కార్టు ఎక్కడుందో.. దాన్ని పోలీసులు ఎలా సంపాదిస్తారో చూడాలి.