Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ పెంచిన అవికాగోర్ పాప్ కార్న్ ఎక్కడ?

By:     |   7 Feb 2023 6:09 PM GMT
గ్లామర్ డోస్ పెంచిన అవికాగోర్ పాప్ కార్న్ ఎక్కడ?
X
ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ అవికాగోర్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన అవికాగోర్ అంతకంటే ముందుగా డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురుతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యింది. ఆ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవికాగోర్ మెప్పించింది. ఇక హీరోయిన్ గా ఉయ్యాల జంపాల సినిమానే ఆమెకి మొదటిది. ఆ సినిమాతో సక్సెస్ అందుకున్న అవికా తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

ఇక నిఖిల్ కి జోడీగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలో ఆమె నటించి హిట్ కొట్టింది. అయితే ఆ సినిమా సమయానికి బొద్దుగా ఉండే అవికా గోర్ కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. భాగా స్లిమ్ అయ్యి గ్లామర్ డోస్ కూడా పెంచింది. స్లిమ్ లుక్ లో ఓంకార్ రాజుగారిగది 3లో ఈ బ్యూటీ సందడి చేసింది. ఈ సినిమాతో హిట్ అందుకుంది. అయితే తరువాత చిన్న సినిమాలు చేస్తూ వస్తుంది. నిర్మాతగా కూడా మారి తాను హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలకి పెట్టుబడి పెడుతుంది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సాయి రోనక్ హీరోగా తెరకెక్కిన పాప్ కార్న్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం కాస్తా గ్లామర్ డోస్ కూడా పెంచి అందాల ఆరబోత చేస్తుంది. అయితే ఏ స్థాయిలో అందాల ఆరబోత చేసిన కూడా ఆమెకి ఆశించిన స్థాయిలో హైప్ అయితే రావడం లేదు. అలాగే స్టార్ హీరోలకి జోడీగా ఆఫర్స్ రావడం లేదు.

ఈ నేపధ్యంలోనే తానే నిర్మాత అవతారం ఎత్తి హీరోయిన్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అవికాగోర్ చేస్తుంది. అయితే పాప్ కార్న్ సినిమా అందులో భాగంగానే చేసిన కూడా సినిమా ప్రమోషన్ కరెక్ట్ గా లేకపోవడం వలన దానిపై ప్రజల దృష్టి వెళ్ళలేదు. పాప్ కార్న్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనేది కూడా జనానికి తెలియలేదు. మరి ఇలాంటి టైమ్ లో ఈ పాప్ కార్న్ తో అవికాగోర్ ఎంత వరకు ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.