Begin typing your search above and press return to search.
ప్రభాస్ అలా అంటాడని అస్సలు అనుకోలేదు: భాగ్యశ్రీ
By: Tupaki Desk | 4 March 2022 5:30 PM GMTమొత్తానికి 'రాధేశ్యామ్' సందడి మళ్లీ మొదలైంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ప్రభాస్ - పూజ హెగ్డే ఇద్దరూ కూడా స్పీడ్ పెంచారు. ఇక మరో వైపు నుంచి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ పరంగా తనవంతుగా చాలా వరకూ ఆమె కవర్ చేస్తున్నారు.
భాగ్యశ్రీ బాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు .. తెలుగులో చేసింది మరీ తక్కువ. అయినా ఆమెను ప్రేక్షకులు మరిచిపోలేదు. అందుకు కారణం 'మైనే ప్యార్ కియా'. ఆ సినిమాలోని ఆమె రూపాన్ని .. తేనె ఒలకబోసినట్టుండే నవ్వును ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు.
ఆ ఒక్క సినిమా ఆమెకు 100 సినిమాలంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అందువల్లనే తమకి ఆమె దూరమై చాలా కాలమైందనే ఫీలింగ్ ప్రేక్షకులకు లేదు. అందువల్లనే ఆమె ఇంటర్వ్యూలకు వెంటనే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా పరంగా ఆమె అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఆ సినిమాలో ఆమె ప్రభాస్ కి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించిన రాధాకృష్ణ కుమార్, చివరికి భాగ్యశ్రీని ఎంపిక చేసుకున్నారు. అయితే కథాపరంగా ఈ పాత్రకి డాన్స్ తెలిసి ఉండాలి.
తనకి డాన్స్ అంతగా రాదని భాగ్యశ్రీ చెప్పినప్పటికీ, ఆ పాత్రకి ఆమెనే కరెక్ట్ అంటూ రాధాకృష్ణ కుమార్ ఫైనల్ చేశారట. ఈ పాత్ర గురించి తనకి రాధాకృష్ణ కుమార్ చెప్పగానే తనకి బాగా నచ్చేసిందనీ, అందుకే వెంటనే అంగీకరించానని భాగ్యశ్రీ అన్నారు.
ఇక ప్రభాస్ ను గురించి ప్రస్తావిస్తూ .. "ఈ సినిమాకి ముందు నేను ఎక్కడా ప్రభాస్ చూడలేదు. ఏ ఫంక్షన్ లోను ఆయనను కలవలేదు .. మాట్లాడలేదు. అయితే బయట ఆయనకి ఏస్థాయిలో క్రేజ్ ఉందనేది నాకు తెలుసు. ఈ సినిమా సెట్లోనే మొదటిసారిగా ఆయనను చూశాను. అందరూ ఆయనను పలకరిస్తున్నారు .. ఆయన కూడా అందరినీ విష్ చేస్తున్నారు. దాంతో ఎలా ఆయనను పలకరించడం అని నేను ఆలోచన చేస్తుండగా ఆయనే నా దగ్గరికి వచ్చేశారు.
ఎలాంటి స్టార్న డమ్ చూపించకుండా నేరుగా నా దగ్గరికి వచ్చి, ఎంతో ఆప్యాయంగా పలకరించారు. తను నా అభిమానినని చెప్పారు. పాన్ ఇండియా స్టార్ అనే గర్వం లేకుండా ఆయన అలా మాట్లాడటం .. పైగా నాకు అభిమానినని చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన అంత సింపుల్ గా ఉంటారనీ .. అలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.