Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ మెహందీ టీజర్ చూశారా!!

By:  Tupaki Desk   |   22 Jan 2018 12:12 PM GMT
ఆ హీరోయిన్ మెహందీ టీజర్ చూశారా!!
X
16 ఏళ్లకే మలయాళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన భావన తెలుగులో మాత్రం చాలా లేట్  గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ల వరకు కష్టపడి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. 2008లో గోపీచంద్ ఒంటరి అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా అమ్మడి అదృష్టం తమిళ్ - మలయాళం లోనే సక్సెస్ అయ్యింది.

అయితే ఎట్టకేలకు వివాదాల అనంతరం పెళ్లి చేసుకున్న భావన రీసెంట్ గా ఒక టీజర్ ని రిలీజ్ చేసింది. పెళ్లి టైమ్ లో ఎందుకు రిలీజ్ చేసింది. ప్రమోషన్స్ కోసమా అని ముందే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె రిలీజ్ చేసిన టీజర్ సినిమాకు సంబంధించింది కాదు. తన వివాహానికి సంబంధించిందే. పెళ్లికి ముందు  రోజు జరిగే మెహందీ ఫంక్షన్ ఎంత ఆనందంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే తరహాలో భావన కూడా హ్యాపీగా జరుపుకుంది.  తన కుటుంబ సన్నిహితుల మధ్య చేసుకున్న వేడుక టీజర్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది.

ఎందుకంటే అందులో అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె నవ్వులోనే ఆనందం కనిపిస్తోంది. ఇక స్టీల్స్ ని చూస్తే తెలియని వారు ఎదో సినిమా అనుకుంటారు. ఇంతకు ఇది ఏ సినిమా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఫుల్ వీడియోని అమ్మడు మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయనుందట.