Begin typing your search above and press return to search.

రిలీజ్ అంటే ప‌డ్నేక‌ర్ బ్యూటీ కాళ్లు..చేతులు పనిచేయ‌వా?

By:  Tupaki Desk   |   20 Dec 2022 12:30 AM GMT
రిలీజ్ అంటే ప‌డ్నేక‌ర్ బ్యూటీ కాళ్లు..చేతులు పనిచేయ‌వా?
X
భూమి పడ్నేకర్.. 2019-20 సీజన్ లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన బ్యూటీ. 2014లో `దమ్ లగా కే హైసా` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి తొలి ప్రయత్నమే భారీగా ప్రయోగం చేసింది. ఉభకాయం సమస్యతో బాధపడే అమ్మాయిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి చిత్రానికి ముందు ఆమె యష్ రాజ్ కంపెనీలో ఆరేళ్ల పాటు కాస్ట్యూమ్ అసిస్టెంట్ గానూ పనిచేసిన విషయం తెలిసిందే.

`దమ్ లగా కే హైసా` సక్సెస్ అయినా ఆమెకి ఛాన్స్ లు క్యూ కట్టలేదు. లావుగా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఆ తర్వాత భారీగా బరువు తగ్గి అందరిని ఆశ్చర్య పరిచింది. చాలా హాట్ గానూ తయారైంది. దీంతో ఈ బ్యూటీ హీరోలు.. డైరెక్టర్స్ కళ్లలో పడింది. అటుపై ఆఫర్స్ వెల్లువ మొదలైంది. 2017 నుంచి బిజీ హీరోయిన్ అయిపోయింది.

ప్రస్తుతం అమ్మ‌డి డేట్లు కోసం ద‌ర్శ‌కులే క్యూలో నుంచున్నారు. ఆ ర‌కంగా ఎద‌గ‌డం అంటే ఇది అని నిరూపించింది. ఇలా న‌టిగా ఇంత అనుభ‌వం సంపాదించినా త‌న కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతుంద‌న్న విష‌యాన్ని రివీల్ చేసింది.

``నా సినిమా రిలీజ్ అయిన ప్ర‌తీ సారి ఒత్తిడికి లోన‌వుతుంటా. అది థియేట‌ర్లో రిలీజ్ అవుతుంటే ఒక‌ర‌కంగానూ...ఓటీటీలో రిలీజ్ అవుతుంటే మ‌రో ర‌కంగానూ ఉంటుంది. థియేట‌ర్ రిలీజ్ అంటే క‌లెక్ష‌న్ల రాబ‌ట్టాల‌నే ఒత్తిడి..ఓటీటీ అయితే అక్క‌డ ర‌క‌ర‌కాల ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ప్ర‌పంచ సినిమాల‌న్నీ అందుబాటులో ఉంటాయి. అక్క‌డ వాట‌న్నింటితోనూ పోటీ పడాలి.

ఇవిగాక ప్రేక్ష‌కులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తారు. ఇవ‌న్నీ ఒకేసారి ఆలోచిస్తే ఒక్క క్ష‌ణం పాటు కాళ్లు....చేతులు ప‌ని చేయ‌వు. ఒక్కోసారి రిలీజ్ ముందు రోజు నిద్ర ప‌ట్ట‌దు. రిలీజ్ అయి టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ ఆ సినిమాలో ఆలోచ‌న‌లే బుర్రంతా ఉంటాయి. ఆ ఒత్తిడి భ‌రించ‌లేక అప్పుడ‌ప్పుడు ఈ రంగం వైపు ఎందుకొచ్చానా? అని మ‌న‌సుకి అనిపిస్తుంది. కానీ ఇష్ట‌మైన రంగంలో ఉన్న తృప్తి ఇంకెక్క‌డా దొర‌క‌ద‌ని స‌ర్ది చెప్పుకుని ముందుకెళ్లిపోతుంటా` అని తెలిపింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.