Begin typing your search above and press return to search.

అస్కార్ రెడ్ కార్పెట్ మీద ఆ నటికి అలా జరిగింది

By:  Tupaki Desk   |   27 Feb 2017 7:51 AM GMT
అస్కార్ రెడ్ కార్పెట్ మీద ఆ నటికి అలా జరిగింది
X
సెలబ్రిటీలందరికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా చెప్పాలి. ఫ్యాషన్ గా కనిపించాలన్నతాపత్రయంతో చేసే ప్రయోగాలు వికటిస్తే.. ఎంతటి ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకుంటుందో ఈ ఉదంతం చెప్పేస్తుంది. ఏ నటికి ఎదురుకాకూడని పరిస్థితిని తాజాగా హాలీవుడ్ నటి బ్లాంకా బ్లాన్ కో ఎదురైంది. 89వ అస్కార్ పురస్కారాల కార్యక్రమానికి అందంగా ముస్తాబై వచ్చిన ఆమె.. ఎక్కడ ఏ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో.. అక్కడే నిర్లక్ష్యంగా వ్యవహరించి.. అడ్డంగా బుక్ అయిపోయింది.

అస్కార్ వేడుకల సందర్భంగా రెడ్ కార్పెట్ మీద నడిచే సెలబ్రిటీలు.. అందరికంటే భిన్నంగా రెఢీ కావటం మామూలే. ఇందులో భాగంగా బ్లాంకా బ్లాన్ కో కూడా విభిన్నమైన డ్రెస్ ను ఎంచుకుంది. ఎల్లో.. గోల్డ్ కాంబినేషన్తో గ్రీన్ డిజైన్ తో ఉన్న ఫ్రాక్ ను ధరించింది. ఆమె వేసుకున్న డ్రెస్ ప్రత్యేకత ఏమిటంటే.. చేతుల మీద బుట్ట గౌన్ల మాదిరి నిండుగా ఉండటమే కాదు.. మెడ వరకూ కప్పేస్తుంది. కానీ.. కిందకు వెళ్లే కొద్దీ.. రెండు కాళ్ల మధ్య వరకూ వచ్చేసరికి మాత్రం కరెక్ట్ గా కట్ అయి ఉంటుంది.

మామూలుగా నడిచినప్పుడు ఓకే కానీ.. ఏ మాత్రం సైడ్ కు తిరిగి ఫోజ్ ఇచ్చినా.. రెండు ముక్కలుగా చీలిన ప్రాంతంలో డ్రెస్ ఉండాల్సిన ప్లేస్ లో ఏ మాత్రం ఉండకున్నా మొదటికే మోసం వస్తుంది. మరి.. ఆ విషయాన్ని ఆమె గుర్తించిందో లేదో కానీ.. రెడ్ కార్పెట్ మీదకు వయ్యారంగా నడిచి వచ్చిన ఆమె.. కాస్త సైడ్ ఫోజ్ ఇచ్చింది.కెమేరాలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. అదే సమయంలో.. రెండు కాళ్ల మధ్యన గ్యాప్ రావటం.. రెండు ముక్కలుగా ఉండే గౌన్ వస్త్రం ఒక్కసారి పక్కకు తప్పటంతో.. ఏం కనిపించకూడదో అది కనిపించేసిన పరిస్థితి.

దీనికి తోడు ఆమె లోదుస్తుల్ని ధరించి రాకపోవటంతో.. కెమేరా కంటికి చిక్కేశాయి. ఈ విషయాన్ని ఆమె గుర్తించిందో లేదో కానీ.. రెడ్ కార్పెట్ మీద నవ్వులు చిందించి వెళ్లినప్పటికి.. కాసేపటికే ఆమె లో అందాల్ని బహిర్గతం చేసే ఫోటోల్ని ఫారిన్ మీడియా పబ్లిష్ చేసేశాయి. అంతేకాదు.. ఆమె డ్రెస్ తేడా కొట్టేయటం.. ఆమె లో దుస్తుల్ని ధరించకుండా వచ్చేశారన్న విషయాన్ని కథనాల్లో చెప్పేశారు. 35 ఏళ్ల ఈ హాలీవుడ్ నటికి ఇంతకు మించిన చేదు అనుభవం మరొకటి ఉండదేమో? అందంగా కనిపించటం బాగానే ఉంటుంది కానీ.. ఆ ప్రయత్నం తేడా కొడితే.. ఏమిటన్నది తాజా ఉదంతమే నిదర్శనంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/