Begin typing your search above and press return to search.

మూడేళ్ల వ‌య‌సులోనే బిల్ క్లింట‌న్ ని ఇష్ట‌డిన క్యాథ‌రీన్!

By:  Tupaki Desk   |   6 Dec 2022 2:30 AM GMT
మూడేళ్ల వ‌య‌సులోనే బిల్ క్లింట‌న్ ని ఇష్ట‌డిన క్యాథ‌రీన్!
X
బాల్యంలో త‌ల్లి -బిడ్డ‌ని చంక‌నేసుకుని `చంద‌మామ రావే..జాబిల్లి రావే` పాట పాడుతూ.. చంద్రుడిని చూపించి గోరు ముద్దులు తినిపిస్తుంది. ఆ చంద్రుణ్ణి చూస్తూ పాపాయి కిల‌కిలా న‌వ్వుతూ మ‌రీ బువ్వ‌ లాగిచేస్తుంది. కానీ ఈ భామ పాపాయి గా ఉన్న‌ప్పుడు సీన్ వేరే. చంద్రుడు బొమ్మ‌కి బ‌ధులుగా వాళ్ల‌మ్మ గొడ‌కు త‌గిలించిన బిల్ క్లింట‌న్ బొమ్మ‌ని చూపించి అన్నం తినిపించేదిట‌.

మ‌రి ఆ త‌ల్లి-బిడ్డా ఎవ‌రో తెలియాలంటే మ్యాట‌ర్లోకి వెళ్లాల్సిందే. వాళ్లెవ్వ‌రో కాదు హీరోయిన్ క్యాథ‌రీన్ ట్రెసా..వాళ్ల అమ్మ‌. అవును క్యాథ‌రీన్ కి స‌రిగ్గా మూడేళ్లు వ‌యసులో ఉన్న‌ప్పుడు చంద‌మామ ఫోటో చూపిస్తే ఏడిచేదంట‌...ఆ వెంట‌నే అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ బొమ్మ చూపిస్తే ఎడవ‌కుండా అన్నం తినేసిద‌ట‌. అలాగే మీకు న‌చ్చిన న‌టులు ఎవ‌రంటే? లియోనార్డో డికాప్రియా ..రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ కి వీరాభిమానిని అని చెప్పింది.

మ‌రి వాళ్లిద‌ర్నీ ..బిల్ క్లింట‌న్ తో స‌మానం చేస్తే ఈ ముగ్గురిలో ఎవ‌రంటే? ఎక్కువ ఇష్ట‌మంటే క్లింటన్ అనేసింది. సినిమా హీరోల‌క‌న్నాచిన్న‌ప్పుడు ఇష్ట‌ప‌డిన బిల్ క్లింట‌న్ అంటేనే ఎక్కువ ఇష్టం అంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే అదేంటో నాకు తెలియ‌దు. మా అమ్మ‌ని అడిగి చెబుతా అని న‌వ్వేసింది. అలాగే చిన్ననాటి నుంచి కెమిస్ర్టీ అంటే బాగా ఇష్ట‌మ‌ట‌. బ‌యోటెక్నా ల‌జీలో పీహెచ్ డీ చేయాల‌నుకుందిట‌.

కానీ ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యాక బెంగుళూరు కాలేజీలో చేరాక స‌ర‌దాగా చేసిన మోడ‌లింగ్ అటుపై సీరియ‌స్ గా చేయ‌డం..అక్క‌డ నుంచి సినిమాల‌కు ప్ర‌మోట్ అవ్వ‌డం అంతా అనుకోకుండా జ‌రిగిపోయిందిట‌. మోడ‌లింగ్ న‌చ్చి క‌న్న‌డ ద‌ర్శ‌కులు సినిమాల్లో అవ‌కాశాలివ్వ‌డంతో పీహెచ్ డీ చేయ‌లేక‌పోయానంది. అలాగే కాబోయే వాడు ఎలా ఉండాలి అంటే? త‌న‌లా పుస్త‌కాలు బాగా చ‌ద‌వాలిట‌. మంచి హైట్..ఫిట్ గా ఉండి ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాలంటోంది. క‌డుపునిండా తినే వాడు అయి ఉండాలి. డైటింగ్ అంటూ నోరు క‌ట్టేసుకునే వాడు వ‌ద్దంటోంది ముద్దుగుమ్మ‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.