Begin typing your search above and press return to search.
కరోనాతో కామెడీనా? తాగావా ఛార్మి అంటూ చీవాట్లు!
By: Tupaki Desk | 2 March 2020 3:12 PM GMTఓవైపు కరోనా దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా లక్షల్లో ఈ వ్యాధి బారిన పడి బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దిల్లీ టు హైదరాబాద్ (తెలంగాణ) కరోనా వైరస్ పాకింది అన్న ప్రచారం హోరెత్తిపోతోంది. విదేశాల నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యిందన్న లీకు వేడెక్కించింది.
అయితే ఇదే అంశాన్ని ప్రస్థావిస్తూ ఛార్మికౌర్ చేసిన ఓ వెకిలి పని సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఛార్మి టిక్ టాక్ వీడియో ఒకటి కొన్ని నిమిషాల పాటు వైరల్ అయ్యి కలకలం రేపింది. ఇంతకీ ఆ టిక్ టాక్ వీడియోలో ఏం ఉంది? అంటే.. తాను స్పృహ కోల్పోతున్నట్టు నటించింది. పైగా కుర్రాళ్లను రెచ్చగొడుతూ మాట్లాడింది. ``ఆల్ ది బెస్ట్ కుర్రాళ్ళు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కరోనావైరస్ దిల్లీ - తెలంగాణకు వచ్చింది. కరోనా వచ్చింది కాబట్టి కుర్రాళ్లు ఆల్ ది బెస్ట్`` అంటూ ఒక జోక్ లాగా బిగ్గరగా నవ్వుతూ ఛార్మి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ వైరల్ గా చర్చకొచ్చింది.
కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4000 మంది చావుకు కారణమైంది. ఓవైపు వైద్య సిబ్బంది పరుగులు పెడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని .. నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఛార్మిలాంటి సెలబ్రిటీ ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందా? జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఒక వీడియో తయారు చేయాల్సింది పోయి.. ఇలా చేస్తుందా? వైరస్ ఇక్కడకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తుందా? అంటూ సోషల్ మీడియాల్లో చెడా మడా తిట్టేస్తున్నారు. మరీ అంత సిల్లీగా టిక్ టాక్ చేస్తుందా? అని కొందరు బూతులు తిట్టేయడంతో ఆ వీడియోని వెంటనే ఛార్మి తొలగించేసింది.