Begin typing your search above and press return to search.

ఆ బెడ్‌ సీన్స్‌ కు నేనేమి బాధపడలేదు : రాశిఖన్నా

By:  Tupaki Desk   |   1 May 2020 7:15 AM GMT
ఆ బెడ్‌ సీన్స్‌ కు నేనేమి బాధపడలేదు : రాశిఖన్నా
X
విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో రాశిఖన్నా కాస్త శృతి మించి నటించిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని బెడ్‌ సీన్స్‌ ఎబ్బెట్టుగా కూడా అనిపించాయి. అయితే ఆ సీన్స్‌ విషయంలో తాజాగా రాశిఖన్నా స్పందిస్తూ ఇష్టం లేకుండానే ఆ సీన్స్‌ చేశాను. మళ్లీ అలాంటి సీన్స్‌ చేయను ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. ఎందుకు ఆ బెడ్‌ సీన్స్‌ చేశానా అంటూ బాధగా ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందని గత మూడు నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఇప్పుడు ఆ సీన్స్‌ గురించి రాశిఖన్నా మాట్లాడుతుందని కొందరు కామెంట్స్‌ చేశారు. అసలు విషయం ఏంటంటే రాశిఖన్నా ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదట, అసలు బెడ్‌ సీన్స్‌ గురించి ఎక్కడ మాట్లాడను కూడా మాట్లాడలేదట. ఆ విషయమై స్వయంగా ట్విట్టర్‌ లో క్లారిటీ ఇచ్చింది. తాను ఇంటర్వ్యూలో మాట్లాడినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం. నేను ఏ సినిమా చేసే సమయంలో బాధపడలేదు. చేసిన తర్వాత ఎందుకు చేశానా అనుకోలేదు.

నేను చేసిన ప్రతి సినిమాను కూడా ఎంజాయ్‌ చేస్తూనే చేశాను. ఎట్టి పరిస్థితుల్లో తాను గత సినిమాల గురించి తప్పుగా మాట్లాడనంటూ చెప్పుకొచ్చింది. తన ప్రమేయం లేకుండానే ఆ వార్తలు వచ్చాయంటూ రాశిఖన్నా ఆవేదన వ్యక్తం చేసింది. తన ట్వీట్‌ తో రాశిఖన్నా మళ్లీ మళ్లీ బెడ్‌ రూం సీన్స్‌ చేసేందుకు సిద్దం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. వరుసగా ఫ్లాప్స్‌ వస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గుతున్నాయి. ఈ సమయంలో ఈమె బెడ్‌ సీన్స్‌ కు నో చెబితే వచ్చే ఆఫర్లు కూడా రావనే ఉద్దేశ్యంతో వెంటనే ఆ వార్తలను కొట్టిపారేసిందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.