Begin typing your search above and press return to search.
ప్రభాస్ హీరోయిన్ విడాకుల పుకార్ల పై క్లారిటీ
By: Tupaki Desk | 4 Jan 2022 10:30 AM GMTతెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ బుజ్జిగాడు సినిమా తో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ సంజన గర్లాని. ఆ తర్వాత తెలుగు లో చాలా సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు స్టార్ డమ్ రాలేదు. అయినా కూడా చిన్నా చితక సినిమాలు.. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ పుష్కర కాలంగా కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. ఈ సమయంలో ఆమె ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంది. ఆమె వైవాహిక జీవితం విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని ఈమద్య కాలంలో మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత వారంలో సంజన గర్లానీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. సంజన తల్లి కాబోతున్నట్లుగా వస్తున్న వార్తల విషయం లో క్లారిటీ రాకుండానే మళ్లీ ఆమె విడాకులు తీసుకునేందుకు సిద్దం అయ్యిందంటూ కన్నడ మీడియాలో కథనాలు మొదలు అయ్యాయి. కన్నడ మీడియాలో వచ్చిన కథనాలను ఇతర భాషల మీడియా వర్గాల వారు కూడా ఫాలో అయ్యారు. దాంతో సంజన గర్లానీ స్పందించింది. తన వ్యక్తిగత విషయాల గురించి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా కథనాలు రాస్తే మాత్రం ముందు ముందు సీరియస్ గా చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది. తన విడాకుల విషయమై వచ్చిన కథనాలపై ఆమె స్పందించిన తీరుతో విడాకుల వార్తలు పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.
సంజన విషయాలు ఏవైనా ఈమద్య కాలంలో వైరల్ అవుతున్నాయి. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుండి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని భావించినా మీడియా వారు మాత్రం ఆమెను వదలడం లేదు అంటూ కన్నడకు చెందిన కొందరు ఆమె స్నేహితులు అంటున్నారు. ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. కాని కన్నడ మీడియా వర్గాల వారు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న లాజిక్ ను తీస్తున్నారు. ఆమె మరింత స్పష్టత ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు. మరి ఆమె ప్రెగ్నెంట్ విషయం మరియు విడాకుల విషయం పై మరో సందర్బంలో అయినా ఆమె ప్రత్యక్ష్యంగా నిరూపిస్తుందేమో చూడాలి.