Begin typing your search above and press return to search.
మేకప్ సిబ్బందికి ఎగవేసిన హీరోయిన్?
By: Tupaki Desk | 2 Sep 2022 4:12 AM GMTసినిమాల నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతలు ఛాంబర్ తో కలిసి థర్డ్ పార్టీలతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్లు అదుపు తప్పడానికి కారణాలను అన్ని విధాలుగా విశ్లేషించిన నిర్మాతలు ఒక్కో విభాగం నుంచి కోతలు స్టార్ట్ చేసారు. ప్రతిదానికి నియమాలను సిద్ధం చేసారు. ఇక చిత్ర నిర్మాణంలో హీరోయిన్ల పారితోషికాలు సహా వారి సిబ్బంది తో వచ్చే అదనపు భారం పైనా గురి పెట్టారు. ఇది కేవలం హీరోయిన్లకే కాదు.. హీరోలు ఇతర టెక్నీషియన్లకు కూడా వర్తించేలా తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇకపోతే మేకప్ మేన్ లు పర్సనల్ సిబ్బందికి సరిగా పారితోషికాలు చెల్లించని ఓ అగ్ర కథానాయిక వ్యవహారం గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. సదరు అగ్ర కథానాయిక ఇటీవలే ఓ బడా నిర్మాణ సంస్థలో పని చేసింది. అయితే అక్కడ పని చేసినందుకు గాను తన వ్యక్తిగత మేకప్ సిబ్బందికి ఇతరులకు చెల్లించాల్సిన స్వల్ప భత్యాలను ఎగవేసిందని .. ఆ మొత్తాలను నిర్మాత నుంచి వసూలు చేసుకోవాలని సూచించిందని కూడా టాక్ వినిపిస్తోంది.
ఓవైపు నిర్మాత నుంచి భారీ పారితోషికం అందుకున్న సదరు హీరోయిన్ తన వ్యక్తిగత సిబ్బంది విషయంలో ఇలా వ్యవహరించడం ఏమిటో అర్థం కావడం లేదన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. అంతేకాదు.. సదరు కథానాయిక తమ భత్యాలు చెల్లించకపోతే తనపై ఎదురుదాడి చేసేందుకు స్టాఫ్ సిద్ధమవుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అయినా ఇప్పుడు రూల్స్ మారాయి. ఇంకా పాత పంథాలోనే సదరు అగ్ర నాయిక ఆలోచిస్తే ఇక కష్టమే. ఇంతకాలంగా సాగిన ఆట ఇకపై సాగదు. మునుపటిలా నిర్మాతలు చెల్లించే సన్నివేశం లేదు. నిర్మాతలకు అటు మండలితో పాటు ఛాంబర్ అండదండలు ఇప్పుడు ఉన్నాయి.
కాబట్టి సదరు హీరోయిన్ తెలివిగా ఆలోచించి వివాదం లేకుండా పరిష్కరించుకోవడం అవసరమని కూడా సూచిస్తున్నారు. తన వ్యక్తిగత మేకప్ సిబ్బందికి ఇతర సిబ్బందికి సరైన సమయంలో తన పారితోషికం నుంచి చెల్లింపులు చేయడం ఒక్కటే ఉత్తమ మార్గం.
అలానే చేస్తుందా? లేక ఇంకేదైనా వివాదానికి తెర తీస్తుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక సిబ్బంది ఖర్చుల విషయంలో హీరోయిన్ల పేర్లనే మీడియా హైలైట్ చేస్తోంది. హీరోలు ఇతర సాంకేతిక నిపుణులకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని ఎక్కడా ప్రచారం చేయకపోవడం అన్యాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.