Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ దివీని ఇంతగా ప్రేమిస్తున్న అతడెవరు?
By: Tupaki Desk | 7 March 2022 2:30 AM GMT``పాడాలి స్మైలివ్వాలి.. ఎందుకంటే జీవితం ఎంతో అందమైనది...`` బిగ్ బాస్ బ్యూటీ దివి వద్యత కోట్ ఇది. అవును నిజమే.. అందంగా ఆడాలి.. మనసారా పాడాలి.. చక్కని స్మైలివ్వాలి! అప్పుడే ఆడపిల్లకు అందం. అలా ఉంటేనే జీవితం కూడా అంతే ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో సాధించలేకపోయానని కలతకు గురైతే అలాంటి వాళ్లు ఎప్పటికీ రాణించలేరు.
అన్నట్టు దివి ఫిలాసఫీకి వీరాభిమానులే కాదు వీర ప్రేమికులు కూడా ఉన్నారని ఒక ప్రేమికుడు నిరూపించాడు. ఇలా ఇన్ స్టాలో అదిరే ఫోటోని షేర్ చేసి క్యాప్షన్ ఇచ్చిందో లేదో.. సమాధి నుంచి నిదురు లేచాడో వీర ప్రేమికుడు. అంతేకాదు.. అతడి కవిత్వం ఇలా ఉంది.
అలరించే నీ కురులు...మత్తెక్కించే నీ కొంటె చూపులు...గిలిగింతలు పెట్టే నీ నవ్వులు...మైమరిపించే నీ సొగసు...ఒక్క మాటలో చెప్పాలంటే అజంతా శిల్పాన్ని మరిపించే దివి!! అంటూ అందమైన కవిత చెప్పాడు ఆ కుర్రాడు.. ఇంతకీ ఎవరా కవి కాని కాళిదాసు..!? అంటారా?
ఈ కాళిదాసు లాంటి కుర్రాడు కానీ దివి వద్యత విద్యాభ్యాసం సాగించిన `నారాయణమ్మ కాలేజీ` చుట్టూ చక్కర్లు కొట్టేవాడా ఏమిటీ? అంటూ కొందరికి సందేహం. ఇంతకీ నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్కడుంది? అంటే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ దిగువగా.. షేక్ పేట నుంచి చిత్రపురి గచ్చిబౌళికి పోయే దారిలో ఉంది.. అక్కడే దివి వద్యత ఇంజినీరింగ్ చదువుకుంది! అప్పటి నుంచే సినీనటి కావాలని మోడల్ ని కావాలని కలలు కందన్నమాట.