Begin typing your search above and press return to search.

సేమ్ పించ్ అంటూ ఇన్ స్టాలో దివి సెగ‌లు!

By:  Tupaki Desk   |   31 Dec 2022 12:30 AM GMT
సేమ్ పించ్ అంటూ ఇన్ స్టాలో దివి సెగ‌లు!
X
ఇన్ స్టా క్వీన్ దివి వ‌ద‌త్య టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ సోషల్ మీడియాలో పిక్ పెట్టిందంటే? అక్క‌డ చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. అంద చందాల‌తో మ‌త్తెక్కించే ఫోట‌ల‌తో కాక‌లు పుట్టిస్తుంది. న‌టిగా క‌న్నా..ఇన్ స్టాక్వీన్ గా ఆ ర‌కంగా బాగా పాపుల‌ర్ అయింది. ఇప్పుడిప్పుడే న‌టిగానూ బిజీ అవుతోంది. తాజాగా బ్యూటీ ఓ హాట్ ఫోటోతో ముందుకొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా లో దుస్తుల్లాంటి ప‌లుచ‌ని వ‌స్ర్తాల్లో సేమ్ పించ్ అంటూ సెగ‌లు పుట్టిస్తుంది. ఎద‌పై టాటూ.. దానిపై రంగులు క‌నిపించేలా ఓ స్నాప్ పోస్ట్ చేసింది. మంచంపై ప‌ర‌వ‌ళింపు సేవ చేస్తూ ఇలా సెల్పీ దిగింది. అమ్మ‌డు బాగా బ‌క్క‌చిక్కిన‌ట్లుంది. జీరో సైజ్ లుక్ ట్రై చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. శ‌రీరంలో కొలెస్ర్టాల్ ఏ మాత్రం ఫోక‌స్ అవ్వ‌లేదు. భూజాల వ‌ద్ద ప‌క్క‌టెముకులు బ‌య‌ట‌కు పొడ‌చుకొస్తున్నాయి. మునుప‌టి ఫోటోల‌తో పోల్చితే శ‌రీరం స‌హారూప లావ‌ణ్యంలో భారీ మార్పులే క‌నిపిస్తున్నాయి.

బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇన్నాళ్లు పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ తో అనూహ్యంగా అమ్మడు కి స్టార్ డమ్ వచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నది కొన్నాళ్లే అయినా కూడా ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు వస్తున్నాయి. `బిగ్ బాస్` ఫినాలే స్టేజ్ పై దివి అందం గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆమె స్థాయిని పెంచాయి.

అంతే కాదు మెగాస్టార్ న‌టిస్తోన్న `వేదాళం` సినిమా రీమేక్` భోళా శంకర్` లోనూ అవకాశం అందుకుంది. బ్యూటీ ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకుంది. పెద్ద ప్రాజెక్ట్ కావ‌డంతో స‌క్సెస్ అందుకుని బిజీ న‌టిగా మారాల‌ని క‌ల‌లు కంటోంది. ఇంకా మరికొన్ని సినిమాల్లోనూ నటించే అవకాశాలు ద‌క్కించుకున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్. వెబ్ సిరీస్ ల్లోనూ నటించేందుకు సిద్దం అవుతోంది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.