Begin typing your search above and press return to search.
దుల్కర్ సల్మాన్ ని అంతగా వేధించారా?
By: Tupaki Desk | 15 Sep 2022 2:30 AM GMTదివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ `మహానటి`. కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో మహానటి సావిత్రిగా నటించిన ఈ మూవీలో జెమినీ గణేషన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ మూవీ తరువాత దుల్కర్ నటించిన తెలుగు మూవీ `సీతారామం`. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హను రాఘవపూరి రూపొందించారు.
ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ ఎపిక్ లవ్ స్టోరీగా నిలిచి యునానిమస్ గా ప్రేక్షకులు, విమర్శలకు చేత బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా వుంటే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో దుల్కర్ సల్మాన్ సంచన విషయాల్ని బయటపెట్టాడు. కెరీర్ ప్రారంభం లో నటుడిగా తనకు ఎదురైన చేదు అనుభవాల్ని ఈ సందర్భంగా దుల్కర్ వెల్లడించి షాకిచ్చాడు. కెరీర్ ప్రారంభంలో నా సినిమాలు రివ్యూలు చదువుతుంటే బాధేసేదన్నారు. నా నటనని విమర్శిస్తూ నెగటివ్ గా కామెంట్ లు చేసేవారని దుల్కర్ వాపోయాడు. అంతే కాకుండా తనకు యాక్టింగ్ రాదని, సినిమాలు ఆపేస్తే మందని దారుణంగా అవమానించారట.
దుల్కర్ తన తండ్రి.. హీరో మమ్ముట్టి లా రాణించలేడని, యాక్టర్ గా పనికి రాడన్నారట. అయితే ఆ వ్యాఖ్యలు తననెంతగానో బాధించాయని చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆర్. బాల్కీ రూపొందించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ `చుప్` లో దుల్కర్ నటిస్తున్న విషయం తెలిసిందే. సన్నిడియోల్, పూజా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 23న రిలీజ్ కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.