Begin typing your search above and press return to search.

ఎల్లికి కూడా మీటూ గోల తప్పలేదట!

By:  Tupaki Desk   |   1 Oct 2019 10:45 AM GMT
ఎల్లికి కూడా మీటూ గోల తప్పలేదట!
X
బాలీవుడ్లో హీరోయిన్ గా అవకాశాలు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. నెపోటిజాలు.. F2 లు.. మీటూలు అన్ని దాటాల్సి ఉంటుంది. అయినా అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉండదు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ భామ స్వీడన్ దేశస్తురాలు. బాలీవుడ్ లో నటి కావాలనే ధ్యేయంతో ముంబైకి వచ్చి వాలింది.

కెరీర్ మొదట్లో అవకాశాల కోసం కొందరు ఫిలిం మేకర్లను కలిసిందట. ఆ సమయంలో ఇద్దరు డైరెక్టర్లను కలిసి సినిమా గురించి చర్చించిందట. వారు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక వేలితో ఎల్లి చేతిని గోకారట. అయితే ఈ భామది ముంబై కాదు కదా.. అందుకే విషయం ఏంటో అర్థం కాలేదు. ఆ మీటింగ్ తర్వాత ఒక ఫ్రెండ్ ను కలిసి ఈ 'వేలి గోకుడు' సంఘటన గురించి వివరించిందట. ఆ స్నేహితుడు షాక్ అయ్యి "ఓ.. అలా చేశాడా? దానర్థం నీకు తెలుసా?" అని ప్రశ్నించాడట. ఎల్లి "నాకు తెలియదు.. ఏంటి దానర్థం?" అని అడిగితే "నాతో నైట్ గడపాలి అని బాలీవుడ్ భాషలో అడగడం" అని వివరించాడట.

ఈ మీటూ గోలే కాదు.. తన ముఖకవళికల గురించి.. ఎత్తు గురించి కూడా ఎన్నో కామెంట్లు చేశారట. "నేను వెయిట్ తగ్గాలని కొందరు అన్నారు. కొందరేమో.. నీ నుదురు పెద్దదిగా ఉంది.. నీ పళ్ళు అదోలా ఉన్నాయని చెప్పారు. ఒకరైతే నువ్వు ఆంటీలా ఉన్నావని కూడా కామెంట్ చేశారట. ముంబై వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి ఎల్లిని చూసి "స్వీట్ హార్ట్ నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు. నువ్వు బాలీవుడ్ లో నటివి కాలేవు" అని చెప్పిందట. అయితే ఇలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా పట్టుదలగా ప్రయత్నించి మరీ నటిగా మారానని తెలిపింది.