Begin typing your search above and press return to search.
కోవిడ్ ను జయించిన ముద్దుగుమ్మ అనుభవాలు.. సూచనలు
By: Tupaki Desk | 21 May 2021 9:42 AM GMTగత ఏడాది నుండి ఇప్పటి వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వారిలో మెజార్టీ మెంబర్స్ కోలుకున్నారు. కరోనా బారిన పడ్డ పలువురు స్టార్స్ కోలుకుని ప్రస్తుతం పూర్తి స్థాయి ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కొందరు జాగ్రత్తలు తీసుకోని కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కరోనా తో బాధపడుతున్న సమయంలో కరోనాను జయించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తినాల్సిన ఆహారం గురించి పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. స్వల్ప లక్షణాలతో కరోనాను జయించిన ఈమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. కరోనాను జయించిన పూజా హెగ్డే పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చింది. కరోనా బారిన పడ్డ వెంటనే ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆందోళన పడటం వల్ల అనారోగ్యం మరింత ఎక్కువ అవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. నేను కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన వెంటనే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టానంది.
కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని సూచించింది. కరోనా ను పూర్తిగా జయించామని భావించవద్దను. సాధ్యం అయినంత వరకు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. చర్మం పాలి పోవడం జుట్టు పొడిబారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కనిపిస్తే తగిన ఆహారం మరియు నీరు తీసుకోవాలంటూ పూజా హెగ్డే సూచించింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ అవ్వడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది.