Begin typing your search above and press return to search.

జాతిరత్నాలు చిట్టి.. టెంప్ట్ అవ్వకుండా..

By:  Tupaki Desk   |   3 Nov 2022 4:30 PM GMT
జాతిరత్నాలు చిట్టి.. టెంప్ట్ అవ్వకుండా..
X
జాతి రత్నాలు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఫారియా అబ్దుల్లా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంది. కుర్రాలను కూడా ఆమె చాలా ఎట్రాక్ట్ చేసింది. గ్లామర్ డోస్ ఎక్కువగా లేకపోయినప్పటికీ తన ఫోటోషూట్స్ తో మాత్రం ఎంతగానో హైలెట్ అవుతోంది. పాత్ర డిమాండ్ చేస్తే కాస్త గ్లామర్ డోస్ పెంచడానికి అయినా కూడా సిద్ధమే అని చెప్పకనే చెబుతోంది.

అయితే ఈ బ్యూటీని అందరూ కూడా బ్యాడ్ లక్ అని అనుకున్నారు. ఎందుకంటే జాతి రత్నాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా ఆమెకు ఎక్కువగా అవకాశాలు రాలేవు. ముఖ్యంగా ఆమె హైట్ ఆమెకు అతి పెద్ద ప్రాబ్లం అని కూడా కామెంట్స్ వినిపించాయి. గతంలో అనుష్క కూడా ఇదే తరహాలో ఓవర్గం హీరోలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆమె కంటే తక్కువ హైట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు దీంతో ప్రాబ్లం అవుతుంది అని ఆమెను సెలెక్ట్ చేసుకోవడానికి వెనుకడుగు వేసినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

ఫారియా అబ్దుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఆమె ఖాళీగా ఏమీ లేను అని చెప్పేసింది. కాకపోతే తొందరపడకుండా కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేసింది.

తనకు సొంతంగా కారు కూడా లేదని చెప్పిన ఈ చిన్నది పెద్దగా ఆశలు లేవని వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసుకుంటే వెళ్లాలని ఉందని తెలియజేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో కూడా విజయ్ ఆంటోనీతో ఒక సినిమా చేస్తోందట. అలాగే కన్నడలో కూడా ఒక మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలియజేసింది. ఇక హిందీలో కూడా ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చింది.

తొందరపడకుండా వీలైనంత వరకు డిఫరెంట్ సినిమాలను చేయాలనే ఆలోచనతోనే కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఉన్నట్లు ఫారియా వివరణ ఇచ్చింది. ఇక ఇప్పుడు సంతోష్ శోభన్ తో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమాతో తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటోంది. ఈ సినిమాపై అంతగా బజ్ అయితే లేదు. మరి ఫారియా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.