Begin typing your search above and press return to search.

కథ వింటే ఆ ఫీలింగ్ రావాలంటున్న ‘చిట్టి’

By:  Tupaki Desk   |   23 Oct 2022 12:30 AM GMT
కథ వింటే ఆ ఫీలింగ్ రావాలంటున్న ‘చిట్టి’
X
జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ కు చెందిన ఈ భామ తన తొలి సినిమాతోనే భారీ హిట్టందుకుంది. ఈ మూవీలో చిట్టిగా ఆమె చేసిన నటనకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత ఫరియా అబ్దులా 'బంగార్రాజు' ఓ స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.

ఫరియా అబ్దుల్లా తాజా చిత్రం 'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' (Like Share Subscribe). ఈ మూవీని నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈక్రమంలోనే చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా(చిట్టి) తాను సినిమా సినిమాకు ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తోందో వెల్లడించింది.

'జాతిరత్నాలు' మూవీ సక్సస్ తర్వాత కావాలనే తాను కొంత గ్యాప్ తీసుకున్నానని చెప్పింది. ఈ కారణంగానే కొత్త సినిమాలను ఒప్పుకోలేదని తెలిపింది. దీనికితోడు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూశానని చెప్పింది. ఒక గట్ ఫీలింగ్ ఉన్న కథతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని అప్పుడే దర్శకుడు గాంధీ ఈ మూవీ కథ చెప్పారని తెలిపింది.

'లైక్ షేర్ సబ్ స్క్రైబ్' స్టోరీని గాంధీ గారు చెప్పినపుడు చాలా మంచి ఫీలింగ్ కలిగిందని తెలిపారు. అందు వల్లే ఈ సినిమా చేయడానికి తాను ఒప్పుకున్నానని ఫరియా అబ్దుల్లా పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేశానని ఫరియా అబ్దుల్లా చెప్పింది.

ఈ సినిమాలో తాను హీరో సంతోష్ తో కలిసి ట్రావెల్ లాగర్స్ గా చేశానని చెప్పింది. ఈ మూవీ ఆద్యంతం ఒక అడ్వెంచర్ లా సాగిపోయిందని తెలిపింది. ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మజీ, సుదర్శన్, నరేన్, సప్తగిరి తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల సంగీతం అందించగా వెంకట్ బోయినపల్లి నిర్మించారు.