Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : కొన్నాళ్లు ప్రకృతిని ఆస్వాదిస్తానంటోంది

By:  Tupaki Desk   |   28 Jan 2022 2:30 AM GMT
పిక్ టాక్‌ : కొన్నాళ్లు ప్రకృతిని ఆస్వాదిస్తానంటోంది
X
హీరోయిన్ గా రంభ గురించి 1980 మరియు 1990 కిడ్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పటికి కూడా ఈమె నటించిన సినిమాలు టీవీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యి అమెరికాలో సెటిల్ అయిన ముద్దుగుమ్మ రంభ మళ్లీ బుల్లి తెర మరియు వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో మళ్లీ అమెరికాకు వెళ్లి పోయింది. అక్కడ బిజీ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఆ బిజీ లైఫ్‌ ను కొన్నాళ్లు పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది.

రంభ ఈ ఫొటోలను షేర్ చేసి ప్రకృతిని ఆస్వాదిస్తానంటూ కామెంట్‌ పెట్టింది. ఎప్పుడు జిమ్‌ ఎక్సర్‌ సైజ్‌.. డైటింగ్.. బ్యూటీ టిప్స్.. యోగా.. కుకింగ్ ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తే మనసు అంతా కూడా గందరగోళంగా ఉంది.. డిప్రెషన్ కు గురి అయినట్లుగా ఉండటంతో పాటు బాధగా కూడా ఉంది. అందుకే ఇలా జీవితాన్ని అప్పుడప్పుడు ప్రకృతి తో గడుపుతూ ఆస్వాదించాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది. నాకు నేను హ్యాపీగా ఉంచుకునేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇలా కొత్త విషయాలను కూడా నేర్చుకుంటున్నాను అంటూ రంభ పేర్కొంది. మంచు కొండలపై అలా అలా బైక్ నడుపుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ఫొటోల్లో రంభం అప్పట్లో సినిమా ల్లో ఎలా అయితే కనిపించిందో అలాగే ఇప్పుడు కూడా ఉందని.. ఇరవై ఏళ్లు అవుతున్నా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెళ్లి అయినా.. పిల్లలకు తల్లి అయినా కూడా రంభం అందం ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఫిజిక్ కూడా ఇంతకు ముందు మాదిరిగానే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మద్య లో రంభ చాలా లావు అయ్యింది. ఆ సమయంలో ఆమె ప్రత్యేకమైన శ్రద్దను ఫిజిక్ పై పెట్టి బరువు తగ్గింది. తద్వారా ఈ అమ్మడు ఫిజిక్ చాలా తగ్గింది. కొన్నాళ్లు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేసినా కూడా ఆమెకు తగ్గ పాత్రలు లభించడం లేదు. దాంతో ఆమె తిరిగి అమెరికా వెళ్లి పోయింది. భవిష్యత్తులో అత్త లేదా అమ్మ పాత్రలకు ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.