Begin typing your search above and press return to search.

సోనాక్షి నుండి మెహ్రీన్ వరకు.. బాలయ్య సినిమా కు మళ్లీ అదే సమస్య

By:  Tupaki Desk   |   15 Dec 2022 5:30 AM GMT
సోనాక్షి నుండి మెహ్రీన్ వరకు.. బాలయ్య సినిమా కు మళ్లీ అదే సమస్య
X
నందమూరి బాలకృష్ణ సినిమా ప్రారంభం అవుతుంది అంటే చాలు హీరోయిన్ గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య కు సరి జోడీని ఎంపిక చేయడానికి దర్శకులకు కష్టంగా మారుతుంది. కేవలం బాలయ్య కు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేసే ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అదే అనడంలో సందేహం లేదు.

బాలయ్య సినిమాల యొక్క హీరోయిన్స్ విషయంలో ఇంకాస్త ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంటుంది. బాలకృష్ణ గత ఏడాది అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

వీర సింహారెడ్డి సినిమా విడుదలకు ముందే బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూట్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడట. #NBK108 వర్కింగ్ టైటిల్ తో రూపొందబోతున్న సినిమా చిత్రీకరణ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ను విభిన్నమైన పాత్రలో గెటప్ లో చూడబోతున్నామట.

ఈ సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక పక్రియ కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్‌ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా మొదలుకుని ఎఫ్‌ 2 అండ్ ఎఫ్ 3 హీరోయిన్ మెహ్రీన్ వరకు ఎంతో మంది హీరోయిన్స్ ను పరిశీలించారట.

కొందరితో చర్చలు జరిపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య సినిమా కు ఇప్పటి వరకు హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు. కానీ సినిమాలోని కీలక పాత్రకు గాను ప్రియమణి ని ఎంపిక చేశారని.. ఆమె కాకుండా మరో హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేయాల్సి ఉంది. షూటింగ్‌ కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

మొదటి షెడ్యూల్‌ లో హీరోయిన్‌ తో సన్నివేశాలు ప్లాన్‌ చేయలేదు. కనుక రెండవ షెడ్యూల్‌ వరకు #NBK108 హీరోయిన్ విషయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్‌ 3 సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వక పోడంతో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.