Begin typing your search above and press return to search.

ఆమె తెరమరుగవ్వడం ఇప్పటికి సస్పెన్స్‌

By:  Tupaki Desk   |   7 Aug 2021 12:44 PM GMT
ఆమె తెరమరుగవ్వడం ఇప్పటికి సస్పెన్స్‌
X
ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 సినిమాలో హీరోయిన్ గా నటించిన గజాల సినిమాను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమాకు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాతో రాజమౌళి టాలీవుడ్‌ లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన గజాల కు కూడా ఒక రకరంగా ఆ సినిమా మొదటిదే. హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేసేంతగా ఆ సినిమాతో సక్సెస్‌ ను గజాల దక్కించుకుంది. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ గా స్టూడెంట్‌ నెం.1 సినిమా నిలవడం వల్ల గజాలకు స్టార్‌ హీరోల సరసన ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోలతో ఈమె సినిమాలు చేసింది. గజాల సినిమాలు వరుసగా వస్తున్న సమయంలోనే అనూహ్యంగా ఆత్మహత్య యత్నం చేయడం.. హీరోతో ప్రేమ విషయం గురించి అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

హీరోయిన్ గా సుదీర్ఘ ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఈ అమ్మడు ఇంకా ఆఫర్లు వస్తున్న సమయంలోనే అనూహ్యంగా తెరమరుగయ్యింది. 2011 సంవత్సరంలో ఈమె చివరి సినిమా వచ్చింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో ఆ తర్వాత చాలా ఆఫర్లు ఆమెకు వచ్చాయి. కాని ఆమె మాత్రం చేసేందుకు ఆసక్తి చూపించలేదు. సినిమాలో హీరోయిన్ గానే కాకుండా ఆ తర్వాత తర్వాత కూడా గజాలకు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కాని ఆమె మాత్రం సినిమాలకు ఆసక్తి చూపించలేదు. 2011 లో సినిమాలకు దూరం అయిన గజాల 2016 సంవత్సరంలో నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది.

ప్రస్తుతం గజాల కుటుంబ సభ్యులతో కలిసి కువైట్ లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఇన్‌ స్టా గ్రామ్ లో తన అందమైన ఫొటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన గజాల ఇప్పుడు ఓకే అంటే సెకండ్‌ ఇన్నింగ్స్ లో వరుసగా ఆఫర్లు రావడం ఖాయం. కాని ఆమెకు మళ్లీ నటించాలనే ఆసక్తి అస్సలు ఉన్నట్లుగా లేదు. ఏమాటకు ఆమాట కాని గజాల అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అంతంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్న వారు ఇప్పటికి కూడా మీరు ఎందుకు నటించడం లేదు.. మీరు తెరమరుగవ్వడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నకు మాత్రం ఇప్పటికి సమాధానం సస్పెన్స్‌ గానే ఉంది.