Begin typing your search above and press return to search.
ఒరిజినల్ ఐటమ్ గాళ్ నేనే: సీనియర్ హీరోయిన్ గౌతమి
By: Tupaki Desk | 27 April 2021 8:34 AM GMTతెలుగు తెరకి పరిచయమైన నాజూకైన కథానాయికలలో గౌతమి ఒకరు. 'గాంధీనగర్ రెండవ వీధి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఆ తరువాత చేసిన 'శ్రీనివాస కల్యాణం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఒకానొక దశలో ఆమె తమిళంలో ఫుల్ బిజీ అయ్యారు. అలాంటి గౌతమి ప్రస్తుతం తనకి నచ్చిన పాత్రల ద్వారా తెరపై మెరుస్తున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు.
"నేను పుట్టింది శ్రీకాకుళంలో .. ఆ తరువాత వైజాగ్ .. కేరళ .. బెంగుళూర్ .. చెన్నై .. ఇలా సాగింది నా ప్రయాణం. ఇన్ని ప్రాంతాలను తిరగడం వలన కొత్త వ్యక్తులను కలుసుకునే .. తెలుసుకునే అవకాశం కలిగింది. 'జెంటిల్ మేన్' సినిమాలో 'చికుబుకు చికుబుకు రైలే' సాంగ్ నా జీవితంలో ఎప్పటికి మరిచిపోలేనిది. ప్రభుదేవాతో కలిసి నేను చేశాను. సుందరం మాస్టారుకి అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి ప్రభుదేవా నాకు తెలుసు. ఎస్.ఏ. చంద్రశేఖర్ గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి శంకర్ తెలుసు.
ఒక రోజున శంకర్ మా ఇంటికి వచ్చాడు .. చిన్న టేప్ రికార్డర్ లో ఆ పాటను వినిపించాడు. ఈ ఒక్క సాంగ్ లో మీరు చేయాలి. ఈ సాంగ్ కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది .. మీరు చేస్తే సినిమాకి ఒక హైలైట్ అవుతుంది అన్నారు. ఆ పాట ఎంత హైలైట్ అవుతుందని నేను ఆలోచన చేయలేదు. ఒక వైపున శంకర్ కి .. మరో వైపున ప్రభుదేవాకి అది కెరియర్ బిగినింగ్. నా వలన ఆ సినిమాకి హెల్ప్ అయితే చాలనే ఉద్దేశంతోనే చేశాను. అలా ఆ పాట చేయడం జరిగింది .. నిజం చెప్పాలంటే ఒరిజినల్ ఐటమ్ గాళ్ నేనే" అంటూ చెప్పుకొచ్చారు.