Begin typing your search above and press return to search.
సింగిల్ గా కుమారి.. భర్తగా అలాంటి వాడే కావాలట!
By: Tupaki Desk | 15 Aug 2022 1:30 AM GMT`కుమారి 21ఎఫ్` సినిమాతో యూత్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేసిన అందాల సోయగం హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అయితే ఈ సినిమానే ఆమె తొలి తెలుగు చిత్రమని చాలా మంది భావిస్తుంటారు. కానీ, `కుమారి 21ఎఫ్`కు ముందే హెబ్బా పటేలా `అలా ఎలా?` అనే సినిమాలో నటించింది. ఇందులో రాహుల్ రవీంద్రన్ హీరోగా చేశాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు.
ఇక `కుమారి 21ఎఫ్` హిట్ అనంతరం వరుస సినిమాలు చేసింది.. కానీ, హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత హెబ్బా పటేల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో హెబ్బా కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. కనీసం టైర్ 2 హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం ఈ అమ్మడు `ఓదెల రైల్వే స్టేషన్`, `తెలిసినవాళ్లు`, `వల్లన్` తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా హెబ్బా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాదు వ్యక్తిగత విషయాలను సైతం అందరితోనూ షేర్ చేసుకుంది.
ముఖ్యంగా డేటింగ్, పెళ్లి వంటి విషయాలపై హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను డేటింగ్ చేశానని, కానీ, వాళ్ళు ఎవరూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదని హెబ్బా చెప్పుకొచ్చింది. తన ఫస్ట్ సినిమా రిలీజ్ కు ముందే బ్రేకప్ అయ్యిందని, అయితే తొలి సినిమా విడుదల తర్వాత బిజీ కావడంతో బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచించ లేదని తెలిపింది. ఇక ఇప్పుడు తాను సింగిల్ గానే ఉన్నానని ఆమె స్పష్టం చేసింది.
అలాగే ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా హెబ్బా పటేల్ వివరించింది. `నేను చాటర్ బాక్స్. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. అందుకే, తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదు, నన్ను ప్రేమగా చూసుకోవాలి` అంటూ హెబ్బా చెప్పుకొచ్చింది. మరి ఈ గుణాలన్నీ ఉండే వ్యక్తి.. హెబ్బా పటేల్ కు దొరుకుతాడో.. లేదో.. చూడాలి.