Begin typing your search above and press return to search.

ఆ వార్త‌లు జనం ఎందుకు చూస్తున్నారు?హేమ‌

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:29 AM GMT
ఆ వార్త‌లు జనం ఎందుకు చూస్తున్నారు?హేమ‌
X
ఈ ఇంట‌ర్నెట్ జ‌మానాలో సోష‌ల్ మీడియా - వెబ్ మీడియా - యూట్యూబ్ వాడకం విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. చేతిలో స్మార్ట్ ఫోన్...చౌక ధ‌ర‌కు మొబైట్ డేటా...ఫ్రీ వైఫై....వెర‌సి సోష‌ల్ - వెబ్ మీడియా - యూట్యూబ్ యూజ‌ర్లు పెరిగిపోయారు. దానికి త‌గ్గ‌ట్లే న్యూస్ - ఎంట‌ర్ టైన్ మెంట్ వెబ్ సైట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకువ‌చ్చాయి. ఈ వెబ్ సైట్ల వ‌ల్ల పాఠ‌కులకు - వీక్ష‌కుల‌కు తాజా స‌మాచారం - విశ్లేష‌ణ‌లు అందుతున్న మాట వాస్త‌వ‌మే. అయితే, కొన్ని వెబ్ సైట్లు ధ‌నార్జ‌నే ధ్యేయంగా....త‌మ వెబ్ సైట్ల ట్రాఫిక్ పెంచుకోవ‌డం కోసం అభ్యంత‌ర‌క‌ర రీతిలో హెడ్డింగ్ లు పెట్ట‌డం - ఫొటోలు మార్ఫింగ్ చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా వెబ్ సైట్ల‌పై టాలీవుడ్ నుంచి కొంద‌రు న‌టీన‌టులు మీడియా ముఖంగా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ న‌టి హేమ ...ఈ త‌ర‌హా త‌ప్పుడు రాత‌ల వ‌ల్ల తాము ఎంతో క్షోభ‌కు గుర‌వుతున్నామ‌ని చాలా సార్లు చెప్పారు. తాజాగా, మిర్యాల గూడ ప్ర‌ణ‌య్ హ‌త్యోదంతం - ఎర్ర‌గ‌డ్డ‌లో మాధ‌వీ-సందీప్ ల పై దాడి నేప‌థ్యంలో ఓ న్యూస్ చానెల్ డిబేట్ లో పాల్గొన్న హేమ‌...ఆ త‌ర‌హా వెబ్ సైట్ల‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

ఈ త‌ర‌హా వెబ్ సైట్ల‌పై తాను గ‌తంలో చాలా ఫైట్ చేశాన‌ని - సినిమా వాళ్ల మీద వ‌చ్చే మార్ఫింగ్ ఫొటోలు...రాత‌లు కంట్రోల్ లో పెట్టామ‌ని హేమ చెప్పారు. ఈ త‌ర‌హా ఫిర్యాదుల కోసం ఏర్పాటైన‌ ప్ర‌త్యేక విభాగానికి కంప్ల‌యింట్ చేస్తే ...ఆ కంటెంట్ ను వెబ్ సైట్ల నుంచి తీసేస్తున్నారని అన్నారు. అయితే, త‌మ ప‌రిస్థితే ఇలా ఉంద‌ని, ఇక సామాన్య మ‌హిళ‌ల ప‌రిస్థితి ఏమిటని...ఎవ‌రికి ...ఎక్క‌డ ఫిర్యాదు చేయాలో కూడా వారికి తెలీద‌ని అన్నారు. అయినా, ఈ త‌ర‌హా కంటెంట్ ను జ‌నాలు ఎందుకు చూస్తున్నారో తెలియ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మాజంలో కూడా మార్పు రావాల‌ని అన్నారు. రేప్ చేసిన వారిని వ‌దిలేసి...ఈ అమ్మాయి రేప్ కు గురైంది అని ఆ అమ్మాయిని కించ‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌డిరోడ్డుపై 100మంది చూస్తుండ‌గా ఒక‌డు క‌త్తి తీసుకువ‌చ్చి ఇద్ద‌రిపై దాడి చేస్తున్నా చోద్యం చూస్తున్నార‌ని...అస‌లు మ‌నుషులు మ‌ధ్య ఉన్నామా....మృగాల మ‌ధ్య ఉన్నామా అనిపిస్తుంద‌ని అన్నారు.

ఒక‌వేళ తాను అక్క‌డుంటే క‌చ్చితంగా ఆ క‌త్తి ప‌ట్టుకున్న వారిని ఆపేదాన్నని...త‌న‌ను పొడిచినా ప‌ర్లేద‌ని ...క‌నీసం ప్ర‌య‌త్నించేద‌న్న‌ని చెప్పారు. గ‌తంలో కూడా ఓ అమ్మాయి న‌డిరోడ్డుపై పిచ్చిపని చేసింద‌ని....దాన్ని కూడా ప‌క్క‌నున్న‌వారు చోద్యం చూశార‌ని...తాను అక్కడుంటే ఆపి... ఇలా చేయి..ప‌రిష్కారం దొరుకుతుంది అని చెప్పేదాన్నని తెలిపారు. ఈ మార్ఫింగ్ ఫొటోలు...రాత‌లు..టైటిల్స్....గురించి గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ను 3 ఏళ్ల క్రితం క‌లిశానని....మీ ఆ త‌ర‌హా మార్ఫింగ్ ఫొటోలో...వెబ్ సైట్ల గురించి త‌న‌కు తెలీద‌ని...ఒక సొల్యూష‌న్ క‌నుక్కొని మెయిల్ చేస్తాన‌ని చెప్పారని అన్నారు. 3 ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టిదాకా మెయిల్ రాలేద‌ని అన్నారు. త్రిప్లెక్స్ వీడియోలు చూసి పిల్ల‌లు చెడిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు....అన్నింటి మీద నిఘా ఉంచ‌లేరని.. స్మార్ట్ ఫోన్ లను త‌ల్లిదండ్రులు కంట్రోల్ చేయాల‌ని అన్నారు.