Begin typing your search above and press return to search.
చలపతి బాబాయ్‌ది తప్పే.. ఒగ్గేయమన్న హేమ
By: Tupaki Desk | 24 May 2017 8:35 AM GMTదశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడూ.. ఎవరి చేత ఒక్క మాట కూడా అనిపించుకోని సీనియర్ నటుడు చలపతిరావు ఒక్క మాటతో పెద్ద విలన్ అయ్యారు. మహిళల విషయంలో ఆయన అన్న మాట అగ్గి పుట్టించటమే కాదు.. ఇండస్ట్రీ.. నాన్ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అందరూ ఆయన్ను విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీనియర్ నటి హేమ ఈ ఉదంతంపై రియాక్ట్ అయ్యారు.
ఫైర్ బ్రాండ్ గా పేరున్న హేమ.. చలపతిరావు వ్యాఖ్యలపై స్పందించారన్న వెంటనే.. ఆమె ఏం మాట్లాడారన్న ఆసక్తి నెలకొనటం ఖాయం. అయితే.. చాలామంది ప్రముఖులతో పోలిస్తే.. హేమ ఆచితూచి మాట్లాడారు. ఈ ఇష్యూను ఇంతటితో ముగిద్దామంటూ ఆమె చెప్పిన సొల్యూషన్ కొత్త చర్చకు తావిచ్చేలా ఉందని చెప్పాలి.
హేమ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన మాటల్ని తప్పు పడుతూనే.. ఆయన్ను ఒగ్గేయాలన్న విషయాన్ని సూటిగానే చెప్పేయటం కనిపిస్తోంది. "మహిళలపై చలపతి బాబాయ్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆడవాళ్లంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిజమే.. చలపతి బాబాయ్ చేసింది తప్పే. అందరితోనూ నేను ఏకీభవిస్తున్నా. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మంచి పని చేశారు. ఇక నుంచి మహిళల గురించి ఒక్క చెడ్డ మాట రాయటానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. మీరు చేసిన మంచి పనిని అభినందిస్తున్నాం. అలాగే చలపతి బాబాయ్ ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడూ ఆడవాళ్లకేం హాని చేయలేదు. అలాంటి పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్స్‌కు వెళ్లి.. మాట జారిన మాట వాస్తవం.. ఆడవాళ్లందరికి నేను క్షమాపణలు అడుగుతున్నానని సంస్కారంగా సారీ అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసులు విత్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. మనమంతా ఐకమత్యంతో ఉందాం" అని అన్నారు.