Begin typing your search above and press return to search.
నా దర్శకుడు చాలా మంచోడు.. ఆరోపణల్ని ఖండించిన హ్యూమా
By: Tupaki Desk | 22 Sep 2020 5:34 PM GMTబాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనని వేధించాడని సంచలన ఆరోపణలు చేసారు పాయల్ ఘోష్. అంతేకాకుండా ఆయనకు హ్యూమా ఖురేషి.. రిచా చద్దా సహా పలువురు కథానాయికలు ఫోన్ కాల్ టచ్ లో ఉంటారని ఆయన చెప్పాడని కూడా పాయల్ పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రిచా చద్దా లీగల్ నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతుండగా.. తాజాగా హ్యూమా కూడా ఖండించారు.
అనురాగ్ నిర్మించిన `గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హ్యూమా తన చిత్రనిర్మాత తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పారు. సోషల్ మీడియా తగాదాలు మీడియా ట్రయల్స్ పై నమ్మకం లేనందున ఇప్పటివరకు ఈ వివాదంపై తాను వ్యాఖ్యానించలేదని ఆమె తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తి దానికి సంబంధించి ఆధారాల్ని అధికారులకు నివేదించాలని తెలిపింది.ఈ ప్రకటనను హుమా ఖురేషి ట్విట్టర్‌లో పంచుకున్నారు.
``అనురాగ్ నేను చివరిసారిగా 2012-13లో కలిసి పనిచేశాం. అతను ప్రియమైన మంచి స్నేహితుడు. చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు. నా వ్యక్తిగత అనుభవంలో నా జ్ఞానం ప్రకారం అతను నాతో లేదా మరెవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. అయినా ఇలాంటి ఆరోపణల్లో పోలీసులు న్యాయవ్యవస్థకు ఆధారాలు సమర్పించాలి`` అని హ్యూమా అన్నారు. ఈ గందరగోళంలోకి లాగడంపై నాకు నిజంగా కోపం ఉంది. నాపైనే కాదు ప్రతి స్త్రీ కూడా కోపంగా ఉన్నారనే భావిస్తున్నా. వారి పని ప్రదేశంలో ఇటువంటి నిరాధారమైన ఊహాగానాలకు ఆరోపణలపై పోరాటం తప్పనిసరి. #MeToo ఉద్యమం పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవడం ఆడ మగ ఇద్దరి బాధ్యత అని హుమా అన్నారు.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2012 లో విడుదలైంది. హుమా ఖురేషి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం మొదటి భాగం జూన్ లో విడుదల కాగా.. రెండవ భాగం 2012 ఆగస్టులో వచ్చింది. 2014 లో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ ఆరోపించిన తరువాత దర్శకుడికి అతని స్నేహితులు ఇతర పరిశ్రమల నుండి మద్దతు లభించింది. తాప్సీ పన్నూ.. రాధికా ఆప్టే సహా కశ్యప్ మాజీ భార్యలు ఆర్తి బజాజ్ .. కల్కి కోచ్లిన్ వరకు అందరూ మద్ధతు పలికారు. ఆయనను సోషల్ మీడియాలో చాలా మంది డిపెండ్ చేస్తున్నారు. అయితే హుమా ఖురేషి, ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా చివరికి మాట్లాడారు.