Begin typing your search above and press return to search.
'ట్రిపుల్ ఆర్' లో ఈ నటి ఎవరు.. ఆమె కథేంటీ?
By: Tupaki Desk | 13 April 2022 1:30 AM GMTదాదాపు మూడున్నరేళ్లుగా ప్రేక్షకులు, సినీ లవర్స్ , మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఎట్టకేలకు విడుదలై సంచలన విజయం సాధించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి అరుదైన కాంబినేషన్ లో చేసిన ఈ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు ధీరుడు రాజమౌళి ఏ టార్గెట్ తో సినిమాని తెరకెక్కించాడో ఆ టార్గెట్ ఆడియన్స్ కి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా చేరువవుతూ వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది.
లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం ల ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీంగానూ, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గానూ కనిపించి ఆకట్టుకున్నారు. సినిమాలో ఎవరి పాత్ర వారితే అన్నట్టుగా ప్రత్యేకంగా అలరించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో మరో నటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం.
ఈ చిత్రంలో ట్రిపుల్ ఆర్ అంటూ ఒక్కో ఆర్ గురించి పరిచం చేసిన రాజమౌళి ఓ ఆర్ ప్లేస్ లో చిన్న పాప మల్లి స్టోరీ అంటూ అదిలాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మల్లీ అనే పాపపై బ్రిటీష్ గవర్నర్ స్కాట్ వైఫ్ ముచ్చపడటంతో తనని బానిసగా తీసుకెళతారు. తనని విడిపించడం కోసం కొమురం భీం ఢిల్లీకి చేరడం.. ఈ క్రమంలో చరణ్ తో పరిచయం ఏర్పడటం జరుగుతుంది. అయితే మల్లీ అనే పాపని గవర్నర్ స్కాట్ తీసుకెళ్లే క్రమంలో ఆ పాప తల్లి లోకి కారుకి అడ్డం తిరిగి ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది. ఆ నటి పేరు అహ్మరీన్ అంజుమ్. తను ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది.
టొట్టా పఠాకా ఐటమ్ మాల్ (2018), `సర్ (2018), క్లాస్ ఆప్ 83 (2020) చిత్రాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న అహ్మరీన్ అంజుమ్ ట్రిపుల్ ఆర్ తో ఇప్పడు మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ట్రిపుల్ ఆర్ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో అహ్మరీన్ అంజుమ్ మీడియాతో ముచ్చటించింది. చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టింది.
`మల్లిని బ్రిటీష్ గవర్నర్ స్కాట్ బలవంతంగా తీసుకువెళుతున్న క్రమంలో వారి కి అడ్డంగా వెళ్లి ప్రతిఘటించాలి. ఈ సీన్ చేస్తున్న సమయంలో నా కాలు బెనికింది. అయినా పంటి బిగువున బాధని భరిస్తూ ఎంత కష్టమైనా సరే ఈ సీన్ ని పూర్తి చేయాలని పట్టుదలతో పూర్తి చేశాను. ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా నా వంతు బెస్ట్ ని ఇవ్వడానికి ప్రయత్నించాను. నిలబడానికి కూడా వీలు లేకపోయినా సరే బాధనంతా భరిస్తూ నటించాను. షాట్ పూర్తయిన తరువాతే ఆ గాయం నొప్పి ఏంటో తెలిసింది. ట్రిపుల్ ఆర్ లో ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసే అవకాశం లభించినందుకు నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఫ్లాష్ బ్యాక్ లో నాకు సంబంధించిన సీన్ లున్నాయి` అని తెలిపింది అహ్మరీన్ అంజుమ్.